నెల్లూరు — పున్నమి ప్రతినిధి
నెల్లూరు నగరంలోని 1వ సెంటర్, సింగనపాలెం ప్రాంతంలో అలంకార్ స్వీట్స్ & బేకర్స్ నూతన శాఖను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న నాయకులు రిబ్బన్ కట్ చేసి షాపును ప్రారంభించారు. నాణ్యమైన స్వీట్స్, బేకరీ ఉత్పత్తులను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ శాఖను ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై అభినందనలు తెలిపారు.


