మాడుగుల, నవంబర్ 01:
మాడుగుల నియోజకవర్గంలోని అర్లి గ్రామంలో ఈరోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు బండారు సత్యనారాయణ మూర్తి పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు అందజేశారు.
ఈ సందర్భంలో రాష్ట్ర కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ పీవీజీ కుమార్ పాల్గొని పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు. లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ నేతల సేవా భావాన్ని ప్రశంసించారు.


