అరకులోయ(పున్నమి ప్రతినిధి), నవంబర్:17
అరకులోయ మండలం సిరగం పంచాయతీ వర్రా గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ దెబ్బ తగిలింది. ఆ గ్రామంలో సుమారుగా 300 మంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో మహిళలు సోమవారం తెలుగుదేశం పార్టీ అరకు ఇన్చార్జి, ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ సియ్యారి దొన్ను దొర గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరందరికీ దొన్నుదొర తెలుగుదేశం కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు.
మాజీ ఎంపిటిసి కొర్ర పోలన్న ఆధ్వర్యంలో టిడిపిలో చేరిన వారిలో వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకుడు జన్ని మధు, జన్ని అఖిల్, జన్ని రామచంద్ర, జన్ని అప్పారావు, వంతల సద్దు, జన్ని బొండన్న, వంతల కొండబాబు, జన్ని అంకులు, జన్ని సత్తిబాబు, కొర్ర అప్పారావు, జన్ని సోయితీ, జన్ని సుబ్బారావు, కిల్లో పవన్, జన్ని బుద్దు, జన్ని సీతారాం, వంతల కన్నయ్య, వంతల శివ, వంతల బద్దు (పెస), వంతల దొంబు, జన్ని సీతారాం, జన్ని సోమీ, మామిడి నీలమ్మ, జన్ని అంజీలు, కొర్ర సావిత్రి, కొర్ర కొండమ్మ, శిరీష, కొర్ర కల, వంతల రాధిక, జన్ని పద్మ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సియ్యారి దొన్నుదొర మాట్లాడుతూ.. విద్యావంతులు రాజకీయాల్లోకి వస్తే సమాజానికి ఉపయోగకరమన్నారు. అటువంటి వ్యక్తి కొర్ర రత్నమ్మ అని తను బిఏ బీఈడీ చదువుకుని తమ గ్రామ అభివృద్ధి కోసం తపించిన మహిళ అన్నారు. ఆమె పార్టీలోకి వచ్చి ప్రజాసేవ చేసేందుకు సుముఖత వ్యక్తం చేయడం శుభపరిణామం అన్నారు. ఈరోజు ఈ కార్యక్రమం తన ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. పార్టీ బలోపేతానికి సమాజాభివృద్ధికి కృషి చేసే వారికి ఎప్పుడూ కూడా గౌరవం ఉంటుందన్నారు. కాస్త ఓపిక పట్టి పని చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. తానే సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ప్రజల ఆదరించారని కానీ సిరగం పంచాయతీలో ఎక్కువమంది తాను గెలవాలని తపించి ఎలక్షన్ నిర్వహించిన వారిలో ఉండటం విశేషం అన్నారు. మహిళల్లో చైతన్యం పెరిగిందని అనేందుకు ఈ సమావేశమే సాక్ష్యం అన్నారు. వారిలో ఇంకా రాజకీయ సామాజిక చైతన్యం పెరగాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ప్రజల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. గిరిజనుల కోసం చేపట్టిన నూతన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు లోకోయి మహాదేవ్, డుంబ్రిగూడ మండల అధ్యక్షుడు కిల్లో ఆనందరావు, కోపరేట్ బ్యాంక్ చైర్మన్ పెట్టెలి రాము, టిడిపి మండల మాజీ అధ్యక్షులు శెట్టి బాబురావు, టిడిపి సీనియర్ నాయకుడు వై సర్పంచ్ పాడి చందు నిర్మల, వంతల వెంకట్రావు, కూన నాగరాజు, సిరిగం పంచాయతీ టిడిపి అధ్యక్షుడు పూజారి మాణిక్యం, ఉప సర్పంచ్ పాంగి మిన్ను, బిజెపి నాయకుడు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

అరకు: సిరగం పంచాయతీ వర్రా గ్రామంలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు
అరకులోయ(పున్నమి ప్రతినిధి), నవంబర్:17 అరకులోయ మండలం సిరగం పంచాయతీ వర్రా గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ దెబ్బ తగిలింది. ఆ గ్రామంలో సుమారుగా 300 మంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో మహిళలు సోమవారం తెలుగుదేశం పార్టీ అరకు ఇన్చార్జి, ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ సియ్యారి దొన్ను దొర గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరందరికీ దొన్నుదొర తెలుగుదేశం కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. మాజీ ఎంపిటిసి కొర్ర పోలన్న ఆధ్వర్యంలో టిడిపిలో చేరిన వారిలో వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకుడు జన్ని మధు, జన్ని అఖిల్, జన్ని రామచంద్ర, జన్ని అప్పారావు, వంతల సద్దు, జన్ని బొండన్న, వంతల కొండబాబు, జన్ని అంకులు, జన్ని సత్తిబాబు, కొర్ర అప్పారావు, జన్ని సోయితీ, జన్ని సుబ్బారావు, కిల్లో పవన్, జన్ని బుద్దు, జన్ని సీతారాం, వంతల కన్నయ్య, వంతల శివ, వంతల బద్దు (పెస), వంతల దొంబు, జన్ని సీతారాం, జన్ని సోమీ, మామిడి నీలమ్మ, జన్ని అంజీలు, కొర్ర సావిత్రి, కొర్ర కొండమ్మ, శిరీష, కొర్ర కల, వంతల రాధిక, జన్ని పద్మ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సియ్యారి దొన్నుదొర మాట్లాడుతూ.. విద్యావంతులు రాజకీయాల్లోకి వస్తే సమాజానికి ఉపయోగకరమన్నారు. అటువంటి వ్యక్తి కొర్ర రత్నమ్మ అని తను బిఏ బీఈడీ చదువుకుని తమ గ్రామ అభివృద్ధి కోసం తపించిన మహిళ అన్నారు. ఆమె పార్టీలోకి వచ్చి ప్రజాసేవ చేసేందుకు సుముఖత వ్యక్తం చేయడం శుభపరిణామం అన్నారు. ఈరోజు ఈ కార్యక్రమం తన ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. పార్టీ బలోపేతానికి సమాజాభివృద్ధికి కృషి చేసే వారికి ఎప్పుడూ కూడా గౌరవం ఉంటుందన్నారు. కాస్త ఓపిక పట్టి పని చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. తానే సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ప్రజల ఆదరించారని కానీ సిరగం పంచాయతీలో ఎక్కువమంది తాను గెలవాలని తపించి ఎలక్షన్ నిర్వహించిన వారిలో ఉండటం విశేషం అన్నారు. మహిళల్లో చైతన్యం పెరిగిందని అనేందుకు ఈ సమావేశమే సాక్ష్యం అన్నారు. వారిలో ఇంకా రాజకీయ సామాజిక చైతన్యం పెరగాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ప్రజల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. గిరిజనుల కోసం చేపట్టిన నూతన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు లోకోయి మహాదేవ్, డుంబ్రిగూడ మండల అధ్యక్షుడు కిల్లో ఆనందరావు, కోపరేట్ బ్యాంక్ చైర్మన్ పెట్టెలి రాము, టిడిపి మండల మాజీ అధ్యక్షులు శెట్టి బాబురావు, టిడిపి సీనియర్ నాయకుడు వై సర్పంచ్ పాడి చందు నిర్మల, వంతల వెంకట్రావు, కూన నాగరాజు, సిరిగం పంచాయతీ టిడిపి అధ్యక్షుడు పూజారి మాణిక్యం, ఉప సర్పంచ్ పాంగి మిన్ను, బిజెపి నాయకుడు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

