పున్నమి ప్రతి నిధి
అయోధ్యలోని పవిత్ర సరయూ ఘాట్ వద్ద 26,17,215 దీపాలు వెలిగించి భక్తి, విశ్వాసం, సనాతన ధర్మం యొక్క మహిమను ప్రతిబింబించే అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఈ మహా దీపోత్సవం ఒకేసారి అత్యధిక దీపాలు వెలిగించడం మరియు భక్తులు దీప ప్రదక్షిణ చేయడం ద్వారా రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సృష్టించింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ వేడుకకు హాజరై శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రాన్ని ప్రకాశవంతం చేసిన ఈ ఘట్టాన్ని సాక్షిగా చూశారు. భక్తి, ఆధ్యాత్మికత, సనాతన ధర్మం వెలుగులు ఈ రాత్రి అయోధ్యను మంత్ర ముగ్ధం చేశాయి.


