ముస్తాబాద్, ఫిబ్రవరి 28 . పున్నమి ప్రతినిధి
ముస్తాబాద్ మండల కేంద్రంలో అమాలి (హమాలి) కార్మికుల సమస్యల పరిష్కారార్థం సమావేశం నిర్వహించారు. అమాలి కార్మికులకు ప్రత్యేకంగా వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వెల్ఫేర్ బోర్డు ఏర్పాటైతే కార్మికులకు సంక్షేమ పథకాలు సులభంగా అందుబాటులోకి వస్తాయని, వారి సమస్యలు సమర్థవంతంగా పరిష్కారమవుతాయని తెలిపారు. చెమటోడ్చి కష్టపడి జీవనం సాగించే అమాలి కార్మికులకు ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు.
అమాలి కార్మికులకు 50 సంవత్సరాలు నిండిన వెంటనే నెలకు ₹5,000 పెన్షన్ ఇవ్వాలని, ప్రమాదాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు ₹10 లక్షల పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఇల్లు లేని నిరుపేద కార్మికులకు గృహాలు నిర్మించాలని కోరారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి అమాలి కార్మికుల సంక్షేమం కోసం చర్యలు తీసుకోవాలని, ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి పథకాలు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఎగమాటి ఎల్లారెడ్డి, సీఐటీయూ నాయకులు ఎలిగంటి రాజశేఖర్, తెలంగాణ బిల్డింగ్ & అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు గీస బిక్షపతి, ముస్తాబాద్ మండల అమాలి కార్మికుల అధ్యక్షుడు నరేష్, రమేష్, చినుగురు దేవయ్య, యాదగిరి, నరసింహులు, సంజీవ్, ఎడ్ల రమేష్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.


