అమలాపురంలో వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రారంభమైన “కోటి సంతకాల ప్రజా ఉద్యమం” పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి చింతా అనురాధ గారు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి గారితో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చింతా అనురాధ మాట్లాడుతూ, వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజల ఆరోగ్యం కోసం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ప్రజల పన్ను డబ్బుతో నిర్మించిన ఈ కాలేజీలను ప్రైవేట్ చేతుల్లోకి ఇవ్వడం రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీస్తుందని హెచ్చరించారు. ప్రజలందరూ ఈ ఉద్యమంలో పాల్గొని తమ సంతకంతో వ్యతిరేకతను తెలియజేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, బొమ్మి ఇజ్రాయిల్, కుడుపూడి సూర్యనారాయణ రావు, మాజీ మంత్రులు గొల్లపల్లి సూర్యారావు, మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్, పి.గన్నవరం మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి దేవి, జిల్లా సమన్వయకర్తలు పినిపే శ్రీకాంత్, గన్నవరపు శ్రీనివాసరావు, పిల్లి సూర్యప్రకాశ్, పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

అమలాపురంలో వైయస్ఆర్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం పోస్టర్ ఆవిష్కరణ
అమలాపురంలో వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రారంభమైన “కోటి సంతకాల ప్రజా ఉద్యమం” పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి చింతా అనురాధ గారు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి గారితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చింతా అనురాధ మాట్లాడుతూ, వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజల ఆరోగ్యం కోసం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ప్రజల పన్ను డబ్బుతో నిర్మించిన ఈ కాలేజీలను ప్రైవేట్ చేతుల్లోకి ఇవ్వడం రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీస్తుందని హెచ్చరించారు. ప్రజలందరూ ఈ ఉద్యమంలో పాల్గొని తమ సంతకంతో వ్యతిరేకతను తెలియజేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, బొమ్మి ఇజ్రాయిల్, కుడుపూడి సూర్యనారాయణ రావు, మాజీ మంత్రులు గొల్లపల్లి సూర్యారావు, మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్, పి.గన్నవరం మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి దేవి, జిల్లా సమన్వయకర్తలు పినిపే శ్రీకాంత్, గన్నవరపు శ్రీనివాసరావు, పిల్లి సూర్యప్రకాశ్, పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

