శ్రీకాళహస్తి, ఏప్రిల్ 03 (పున్నమి న్యూస్): ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొంది, అమరావతిని శాశ్వత రాజధానిగా నిర్ణయించిన నేపథ్యంలో శ్రీకాళహస్తి పట్టణంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు, పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కూటమి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఎన్టీఆర్, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కీర్తిశేషులు నందమూరి తారకరామారావు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. తదుపరి కార్యకర్తలు రంగులు చల్లుకుంటూ, స్వీట్లు పంచుకుంటూ, టపాకాయలు పేల్చుతూ ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. “జై అమరావతి – జై జై అమరావతి” నినాదాలతో పట్టణం మార్మోగింది. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ.. అమరావతి రైతుల త్యాగాలను ఎప్పటికీ మరువలేమని, వారి పోరాట ఫలితంగానే అమరావతి రాజధానిగా చట్టబద్ధత పొందిందని అన్నారు. అమరావతిని శాశ్వత రాజధానిగా నిలబెట్టేందుకు కృషి చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తదితర నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ క్లస్టర్ ఇన్‌చార్జిలు, బూత్ ఇన్‌చార్జిలు, బిఎల్ఏలు, తెలుగు మహిళల నాయకులు, టిడిపి కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

అమరావతి శాశ్వత రాజధాని నిర్ణయం-శ్రీకాళహస్తిలో టిడిపి నేతల ఘన సంబరాలు