శ్రీకాళహస్తి, ఏప్రిల్ 07 (పున్నమి న్యూస్): రాజధాని అమరావతి పరిరక్షణే లక్ష్యంగా, రాష్ట్ర భవిష్యత్తు కోసం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో “అమరావతి విజయోత్సవ” భారీ బహిరంగ ర్యాలీ అట్టహాసంగా సాగింది. స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, వేలాది మంది కార్యకర్తలు, అమరావతి పరిరక్షణ సమితి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనడంతో పట్టణం పండగ వాతావరణాన్ని తలపించింది. పట్టణంలోని ఏపీ సీడ్స్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ఈ భారీ ర్యాలీ, వందలాది బైక్లు మరియు వేలాది మంది ప్రజల భాగస్వామ్యంతో అత్యంత ఉత్సాహంగా సాగింది. నాలుగు మాడ వీధుల గుండా ప్రయాణించిన ఈ ప్రదర్శనలో అమరావతికి మద్దతుగా నినాదాలు మిన్నంటాయి. మన రాజధాని కోసం నిలబడిన ప్రతి ఒక్కరి గొంతుక ఈ ర్యాలీలో ప్రతిధ్వనించిందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ విజయవంతమైన కార్యక్రమంపై ఎమ్మెల్యే స్పందిస్తూ.. రాష్ట్ర అభివృద్ధి కోసం, అమరావతి భవిష్యత్తు కోసం ఇంతటి భారీ మద్దతు తెలిపిన కూటమి శ్రేణులకు, నా నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు. మన రాజధానిని కాపాడుకుంటూ, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించే వరకు మన పోరాటం, మన ఉత్సాహం ఇలాగే కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతలు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

అమరావతి గర్జన-శ్రీకాళహస్తి వీధుల్లో జన ప్రభంజనం