అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి
అమరజీవి పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న మద్రాసు నగరంలో జన్మించారు. వీరి పూర్వీకులది నెల్లూరు, శానిటరి ఇంజనీరింగ్ చదివి, ముంబై రైల్వేలో ఉద్యోగం చేశారు. భార్య, తల్లి చనిపోగా విరక్తితో ఉద్యోగం వదిలి, దేశసేవలో మునిగారు. గాంధీజీ అభిమానిగా ఆశ్రమ జీవితం కొన్నాళ్ళు గడిపారు. 1930 ఉప్పు సత్యాగ్రహం, 1942 క్విట్ ఇండియా ఉద్యమాల్లో జైలు కెళ్ళారు. దళితులకు ఆలయ ప్రవేశం కోసం ఆలుపెరగని పోరాటం చేశారు. మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉన్న తెలుగు ప్రాంతాలను విడదీసి, ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని ప్రజలు కోరుతుండే వారు. కేంద్ర ప్రభుత్వం తెలుగు వారి కోర్కెను పట్టించుకోలేదు. పొట్టి శ్రీరాములు 1952 అక్టోబర్ 19న మద్రాసులో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. 58 రోజుల దీక్ష ఆనంతరం 1952 డిసెంబర్ 15న పొట్టి శ్రీరాములు కన్నుమూశారు. తదనంతరం పరిణామాలతో 1953 నవంబర్ 1న కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. ఆ తరువాత హైదరాబాద్‌తో కలిసిన తెలంగాణ ప్రాంతాన్ని కలిసి ఆంధప్రదేశ్‌గా ఏర్పడింది. తెలుగు వారికి పొట్టి శ్రీరాములు త్యాగం గుర్తుండి పోతుంది.