వెంకన్నపాలెం నుండి చోడవరం మాడుగుల రోలుగుంట వడ్డాది పాడేరు రహదారులు వెంటనే పునర్నిర్మాణం చేయాలని నేటికి ఆరు రోజులుగా చోడవరం తాసిల్దార్ గారి కార్యాలయం పక్కన ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా, కూటమి నాయకులు ప్రజల ఇబ్బందులను గమనించకుండా ఏదో ఆలోచనలో పడ్డారు. కూటమి నాయకులను ప్రజలు ఎంతగానో నమ్మి ఓట్లు వేసి గెలిపించినందుకు ఇంటికి సురక్షితంగా చేరే దారే లేకుండా పోయింది. సాయంత్రం సమయాల్లో వాహనదారులందరూ తీరని ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్లు చెరువులుగా మారిపోవడం వల్ల మహిళలు, స్కూల్ బస్సులు, 108 వాహనాలు తదితర వాహనాలన్నీ కూడా తీరని ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను స్థానిక నాయకులు చోడవరం మాడుగుల నియోజకవర్గ కూటమి నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు గారి ఇంటిముందు ధర్నా చేసిన నిధులు తెచ్చి రోడ్లు పునః ప్రారంభించి ప్రజలు సురక్షితంగా ఇంటికి చేరే విధంగా చేయవలసిన బాధ్యత కూటమి నాయకులపై ఉంది. ఇదివరకు ఉన్న కాంట్రాక్టర్లను పక్కనపెట్టి కొత్త కాంట్రాక్టర్లకు ఈ రోడ్డు నిర్మాణం అప్పగించాలి. పాతవారిని పక్కన పెట్టండి ప్రజల ప్రాణాలు ముఖ్యం కాంట్రాక్టర్లు కాదు. వెంటనే కూటమి నాయకులు స్పందించి రోడ్ల పనులు పునర్మించాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తుంది.
ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కొణతాల హరినాథ్ బాబు, అల్లూరి జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ ఎస్ గంగరాజు గారు, చోడవరం నియోజకవర్గ ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ వేగి మహాలక్ష్మి నాయుడు, అనకాపల్లి ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్త ఏ త్రినాథ్ గారు, పాడేరు మహిళా ప్రతినిధులు ముష్య నానమ్మ, రూడీ రవణమ్మ తదితరులు పాల్గొన్నారు.


