Sunday, 7 December 2025
  • Home  
  • అన్నారంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం రైతులకు గిట్టుబాటు ధర కల్పన
- కామారెడ్డి

అన్నారంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం రైతులకు గిట్టుబాటు ధర కల్పన

– సొసైటీ చైర్మన్‌ స్వామి కామారెడ్డి, 29 అక్టోబర్‌, ( పున్నమి ప్రతినిధి ) : రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చేపడుతున్న ధాన్య కొనుగోలు కార్యక్రమం భాగం గా కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం,అన్నారం గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం, వడ్లు అరబెట్టే మిషన్‌ను ఏర్పాటు చేశారు. బుధవారం ఈ కేంద్రా న్ని మాచారెడ్డి వ్యవసాయ సహకార సంఘం చైర్మన్‌ స్వామి గౌడ్‌, మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగరావు సంయుక్తంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా చైర్మన్‌ స్వామి గౌడ్‌ మాట్లాడుతూ, రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా తమ వడ్లను విక్రయించాలనీ, మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని పిలుపునిచ్చారు. ప్రభుత్వం రైతుల కు గిట్టుబాటు ధర కల్పిస్తోందని అన్నారు.ముఖ్యం గా సన్నవడ్లకు ప్రతి క్వింటాల్‌ పైగా 500 రూపాయ ల బోనస్‌ అందిస్తున్నదని తెలిపారు. రైతుల ప్రయోజనం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోం దని పేర్కొన్నారు.సొసైటీ సీఈఓ చంద్రరెడ్డి మాట్లా డుతూ, కొనుగోలు కేంద్రాల వద్ద తగిన ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. వడ్ల సేకరణ, కొలతలు, చెల్లింపుల ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహిం చేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. గ్రా మంలో కొత్తగా ఏర్పాటు చేసిన వడ్లు అరబెట్టే మిషన్‌ రైతులకు ఎంతో ఉపయుక్తంగా ఉండబో తోందని, పంట సీజన్‌లో తడువడ్లు ఆరబెట్టే సౌక ర్యం వల్ల సమయానుకూలంగా ప్రభుత్వ కొనుగో లు కేంద్రాలకు సరఫరా చేయగలరని రైతులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్‌ నాయకులు మద్దికుంట దయానంద్‌, గంగరెడ్డి, సల్మాన్‌, కిసరి లక్ష్మణ్‌, దేవదాసు, చంద్రం, మండ్ల బాలనర్సు, రవి నాయక్‌ తదితరులు పాల్గొన్నారు

– సొసైటీ చైర్మన్‌ స్వామి

కామారెడ్డి, 29 అక్టోబర్‌, ( పున్నమి ప్రతినిధి ) :

రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చేపడుతున్న ధాన్య కొనుగోలు కార్యక్రమం భాగం గా కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం,అన్నారం గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం, వడ్లు అరబెట్టే మిషన్‌ను ఏర్పాటు చేశారు. బుధవారం ఈ కేంద్రా న్ని మాచారెడ్డి వ్యవసాయ సహకార సంఘం చైర్మన్‌ స్వామి గౌడ్‌, మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగరావు సంయుక్తంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా చైర్మన్‌ స్వామి గౌడ్‌ మాట్లాడుతూ, రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా తమ వడ్లను విక్రయించాలనీ, మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని పిలుపునిచ్చారు. ప్రభుత్వం రైతుల కు గిట్టుబాటు ధర కల్పిస్తోందని అన్నారు.ముఖ్యం గా సన్నవడ్లకు ప్రతి క్వింటాల్‌ పైగా 500 రూపాయ ల బోనస్‌ అందిస్తున్నదని తెలిపారు. రైతుల ప్రయోజనం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోం దని పేర్కొన్నారు.సొసైటీ సీఈఓ చంద్రరెడ్డి మాట్లా డుతూ, కొనుగోలు కేంద్రాల వద్ద తగిన ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. వడ్ల సేకరణ, కొలతలు, చెల్లింపుల ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహిం చేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. గ్రా మంలో కొత్తగా ఏర్పాటు చేసిన వడ్లు అరబెట్టే మిషన్‌ రైతులకు ఎంతో ఉపయుక్తంగా ఉండబో తోందని, పంట సీజన్‌లో తడువడ్లు ఆరబెట్టే సౌక ర్యం వల్ల సమయానుకూలంగా ప్రభుత్వ కొనుగో లు కేంద్రాలకు సరఫరా చేయగలరని రైతులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్‌ నాయకులు మద్దికుంట దయానంద్‌, గంగరెడ్డి, సల్మాన్‌, కిసరి లక్ష్మణ్‌, దేవదాసు, చంద్రం, మండ్ల బాలనర్సు, రవి నాయక్‌ తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.