నెల్లూరు, ఆగష్టు, (పున్నమి ప్రతినిధి) :
నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో జేమ్స్ గార్డెన్, వెంకట్రామాపురంలో మూడు ఆసుపత్రి భవనాలను అనుమతించిన దానికంటే అదనపు అంతస్తులు నిర్మించారు. ఈ మూడు భవనాలపై ఫిర్యాదులు రావడంతో కార్పొరేషన్ అధికారులు విచారణ చేపట్టి కూల్చివేత ప్రారంభించారు. మూడు భవనాలపై అదనపు అంతస్తులను గత నాలుగు రోజులుగా కూల్చి వేస్తున్నారు. శుక్రవారం కూడా కూల్చివేత పనులు కొనసాగాయి. అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తామని టీపీఓ తెలిపారు.


