ఖమ్మం జనవరి
(పున్నమి ప్రతి నిధి)
అనారోగ్య కారణాలతో మృతి చెందిన మధిర డివిజన్ సీపీఎం ప్రముఖ నాయకులు కట్టా గాంధీ గారి భౌతిక కాయానికి బీజేపీ నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. కల్లూరు మండలం పోచారం గ్రామంలోని ఆయన స్వగ్రామంలో నిర్వహించిన అంత్యక్రియలకు బీజేపీ కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, ఖమ్మం జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ హాజరై పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా వారు కట్టా గాంధీ గారు ప్రజా సమస్యల పరిష్కారానికి, కార్మిక–రైతు ఉద్యమాలకు చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.



