అజిలాపూర్ లో వ్యక్తి దారుణ హత్య
*హత్యకు కారణంపై పోలీసుల దర్యాప్తు
దేవరకద్ర ప్రతినిధి, అక్టోబర్ 24 ()
మండలంలోని అడివి అజిలాపూర్ గ్రామంలో వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన చోటు చేసుకున్నట్లు మహబూబ్నగర్ డిఎస్పి వెంకటేశ్వర్లు భోత్పూర్ సిఐ రామకృష్ణ తెలిపారు.
డీఎస్పీ, సిఐ తెలిపిన వివరాల ప్రకారం అజిలాపూర్ లో ఓ వ్యక్తిని అతి దారుణంగా నరికి హత్య చేసిన సంఘటన చోటుచేసుకుంది. అజిలాపూర్ గ్రామానికి చెందిన దానం మైబు (40) సంవత్సరాలు గల వ్యక్తి వృత్తిరీత్యా దేవరకద్ర మార్కెట్ యార్డులో హమాలిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మైబు తన పని ముగించుకొని తన గురువారం రాత్రి తన స్వంత గ్రామానికి తన మోటార్ సైకిల్ పై వస్తుండగా అడవి అజిలాపూర్ గేటుకు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని దారుణంగా నరికి హత్య చేశారు. విషయం తెలుసుకున్న దేవరకద్ర పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని వివాహేతర సంబంధమే కారణమా! లేదా ఇంకా ఏమన్నా కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు త్వరలోనే నిందితులను పట్టుకుంటామని డీస్పీ, సీఐ తెలిపారు. మృతుడికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. అందరితో కలిసి మెలసి ఉండే వ్యక్తి దారుణ హత్యకు గురి కావడంతో అడివి అజిలాపూర్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి.


