నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పున్నమి ప్రతినిధి ఆగస్టు 18.
MLA డా చిక్కుడు వంశీకృష్ణ
నాగర్ కర్నూల్ జిల్లాలో అచ్చంపేట పట్టణంలో నిర్వహిస్తున్న మెగా సర్జికల్ క్యాంపు సోమవారం 30 మందికి ఆపరేషన్లు పూర్తి చేశామని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ తెలిపారు. ఈ క్యాంపు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఆగస్టు 31 వరకు ఈ సర్జికల్ క్యాంపు కొనసాగుతుందని ఇంకా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పేర్లు నమోదు చేసుకోవాలని డాక్టర్ ఎమ్మెల్యే ప్రజలకు సూచనలు చేశారు అచ్చంపేట నల్లమల్ల ప్రాంత ప్రజలు ఇంకా ఎవరైనా పేర్లు నమోదు చేసుకొని వారు ఉంటే నమోదు చేసుకొని ఈ యొక్క మెగా సర్జికల్ క్యాంపు ను సద్వినియోగం చేసుకోగలరు… ఈ క్యాంపులో సేవలందిస్తున్నసూపర్డెంట్ డాక్టర్ ప్రభు,వనపర్తి డిఎంహెచ్వో శ్రీనివాస్,డి సి హెచ్ రామకృష్ణ , డా.శ్రీనివాసులు ,స్టాఫ్ నర్స్, థియేటర్ అసిస్టెంట్లు,గోవర్ధన్ , పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. వైద్య బృందాన్ని ఎమ్మెల్యే అభినందించారు.


