*అగ్నిప్రమాద చిన్నారులకు రూ. 10,000 ఆర్థిక సాయం*
* *కుటుంబ సభ్యులను పరామర్శించిన వాసుపల్లి*
*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-*
అగ్ని ప్రమాదంలో గాయపడిన ఇద్దరు చిన్నారులకు మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ రూ. 10,000 అందజేసి మరో సారి తన దాతృత్వం చాటుకున్నారు.
30వ వార్డు రెల్లి వీధి పిల్ల అప్పయ్య ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగి పిల్లా
నక్షత్రలహరి, పిల్లా ధనుష్ అనే ఇద్దరు చిన్నారులు కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నారు. వార్డ్ అధ్యక్షులు దశమంతుల మాణిక్యాలరావు & వార్డ్ బీసీ సెల్ అధ్యక్షులు వేణు ద్వారా
విషయం తెలుసుకున్న పేదల పెన్నిధి వాసుపల్లి గణేష్ కుమార్ ఇంటికి వెళ్లి కుటుంబాన్ని ఓదార్చి చిన్నారులను పరామర్శించారు. అనంతరం కుటుంబ సభ్యులకు భరోసా కల్పించి ధైర్యం నింపారు. పిల్లలు తొందరగా కోలుకొని చిరునవ్వుతో మళ్ళీ స్కూలుకు వెళ్లే బాగా చదువుకోవాలని వారితో కాసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో 30వ వార్డ్ ప్రెసిడెంట్ దస్మాంతుల మాణిక్యాలరావు, స్టేట్ ఆర్టిఐ సెకరెటరీ దస్మాంతుల చిన్ని, జిల్లా ఆర్టిఐ ప్రెసిడెంట్ వడ్డాది దిలీప్, 37వ వార్డ్ కార్పొరేటర్ చెన్నా జానకిరామ్, వార్డ్ బీసీ సెల్ అధ్యక్షులు వేణు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ రేయ్ డేవిడ్ రాజు, జిల్లా బీసీ సెల్ ప్రెసిడెంట్ సనపల రవీంద్ర భారత్,29వ వార్డ్ ప్రెసిడెంట్ పీతల వాసు, 36వ వార్డ్ మహమ్మద్ షకిల్, సౌత్ ఆర్టీఐ ప్రెసిడెంట్ కోరాడ సురేష్, వార్డ్ నాయకులు దస్మాంతుల సంతోషి,సౌత్ sc సెల్ ప్రెసిడెంట్ ఆకుల శ్యామ్,37వ వార్డ్ ఇంచార్జ్ గంగళ్ల రామరాజు,30 వార్డ్ & 36,37 వార్డ్ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు.


