ബന്ധപ്പെടുക പുതിയ വാർത്തകൾ
യഥാർത്ഥ വാർത്ത. വേഗത്തിലുള്ള വിവരം. ആന്ധ്രാപ്രദേശ് • തെലങ്കാന • ദേശീയ
രചയിതൃ പാനൽ
കിഴക്കൻ ഗോദാവരി

అక్రమ కేసులకు చరమగీతం.. నిజం గెలిచిందంటూ అనపర్తిలో కూటమి గర్జన!

പുന്നമി ന്യൂസ്‌റൂം പ്രസിദ്ധീകരിച്ചത്: പുതുക്കിയത്:
అక్రమ కేసులకు చరమగీతం.. నిజం గెలిచిందంటూ అనపర్తిలో కూటమి గర్జన!

నిజం గెలిచిందంటూ కూటమి శ్రేణుల నినాదాలు

అనపర్తి, సెప్టెంబరు 9 (పున్నమి ప్రతినిధి): మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టు చేసి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా అనపర్తిలో కూటమి శ్రేణులు ‘నిజం గెలిచింది’ పేరుతో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి నల్లమిల్లి మనోజ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మనోజ్ రెడ్డి మాట్లాడుతూ 2023 సెప్టెంబరు 9 రాష్ట్ర రాజకీయాల్లో చీకటి రోజుగా అభివర్ణించారు. చంద్రబాబు నాయుడును అక్రమ కేసులో అరెస్టు చేసి సుమారు 53 రోజుల పాటు జైలులో ఉంచారని పేర్కొన్నారు. ఆయనకు సంఘీభావంగా దేశ, విదేశాల్లోని తెలుగు ప్రజలు పెద్దఎత్తున ఉద్యమించారని తెలిపారు. అనంతరం ప్రజలు చంద్రబాబుకు అద్భుతమైన మద్దతు, రాజకీయ మాండేట్ ఇచ్చారని అన్నారు.

కేసులో న్యాయపరమైన పోరాటం కొనసాగిస్తూ చంద్రబాబు బయటకు వచ్చారని, ఈ నేపథ్యంలో ‘నిజం గెలిచింది’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మనోజ్ రెడ్డి తెలిపారు.

అక్రమ కేసులకు చరమగీతం.. నిజం గెలిచిందంటూ అనపర్తిలో కూటమి గర్జన!

అక్రమ కేసులకు చరమగీతం.. నిజం గెలిచిందంటూ అనపర్తిలో కూటమి గర్జన!

అక్రమ కేసులకు చరమగీతం.. నిజం గెలిచిందంటూ అనపర్తిలో కూటమి గర్జన!

అక్రమ కేసులకు చరమగీతం.. నిజం గెలిచిందంటూ అనపర్తిలో కూటమి గర్జన!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *