సెప్టెంబర్ 18 పున్నమి ప్రతినిధి @
ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు దీపావళి వేళ డబుల్ బొనాంజో తగలబోతోంది. ఆగస్టులో వచ్చినట్టుగానే ఈ అక్టోబర్‌లో కూడా ఇటు పీఎం కిసాన నిధులు, మరోవైపు కొత్తగా అమలులోకి వచ్చిన అన్నదాత సుఖీభవ నిధులు ఖాతాల్లో జమ కాబోతున్నాయని తెలుస్తోంది. జులైలో ఇవ్వాల్సిన పీఎం కిసాన్ నిధులు నెల ఆలస్యంగా ఆగస్టులో విడుదల చేశారు. అయితే ఈసారి మాత్రం ఆలస్యం చేయకూడదని కేంద్రం భావిస్తోంది. అందుకే అక్టోబర్‌లోనే 21వ విడత పీఎం కిసాన్ స్కీమ్ నిధులు రైతుల ఖాతాల్లో వేయనుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే పని చేయనుందని తెలుస్తోంది.
ఇటు కేంద్రం పీఎం కిసాన్ నిధులతోపాటు, అటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అన్నదాత సుఖీభవ నిధులు కలుపుకొని ఈ దీపావళి సందర్భంగా ఒక్కో రైతు అకౌంట్‌లో 7వేల రూపాయలు జమ కానున్నాయి.
పీఎం కిసాన్ యోజన, అన్నదాత సుఖీభవ పథకం కలిపి యేటా ఇరవై వేల రూపాయలు రైతులకు లబ్ధి కలగనుంది. రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు ఇస్తే కేంద్రం ఆరు వేలు జమ చేస్తోంది. మొదటి విడతలో ఏడు వేలు జమ చేశారు. ఇప్పుడు రెండో విడతలో మరో ఏడు వేలు జమ చేయనున్నారు. మూడో విడతను ఫిబ్రవరిలో వేసే అవకాశం ఉంది. అప్పుడు ఆరువేల రూపాయలు వేస్తారు.


