పున్నమి ప్రతి నిధి
రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలపై ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు పలు సూచనలు చేశారు. మార్కెట్ యార్డులకు తీసుకొచ్చిన పంట ఉత్పత్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
అందుబాటులో ఉన్న టార్పాలిన్ కవర్లను వినియోగించి మార్కెట్ యార్డుల్లో ఉన్న ధాన్యం, మక్కజొన్న తదితర పంటలను రక్షించాలన్నారు. రైతులకు నష్టాలు కలగకుండా సంరక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించి పంటలను భద్రపరచాలని సూచించారు.
వర్షాల ప్రభావంతో రైతులు ఇబ్బందులు పడకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని, పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.


