చందర్లపాడులో రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పిలుపునిచ్చారు. చందర్లపాడు మండలం చందర్లపాడు గ్రామంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ “అంబేద్కర్ కేవలం రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాకుండా సామాజిక న్యాయానికి దిశానిర్దేశం చేసిన మహానేత. కుల వివక్ష, అంటరానితనం నిర్మూలన కోసం ఆయన చేసిన పోరాటం చిరస్థాయిగా నిలిచిపోతుంది. మహిళలు, అణగారిన వర్గాల అభ్యున్నతికి రాజ్యాంగం ఆయన అందించిన అమూల్య మైన వరం” అని పేర్కొన్నారు.
సమానత్వం–సోదరభావం అంబేద్కర్ ఆశయాల మూలం అని, ఆ విలువలను ప్రతి పౌరుడు ఆచరించాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో లాల్ బహదూర్ లెఫ్ట్ కెనాల్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ కోట వీరబాబు, కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

అంబేద్కర్ వర్ధంతి—అభిలాషల సాధనకే ప్రతి అడుగు: ఎమ్మెల్యే సౌమ్య
చందర్లపాడులో రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పిలుపునిచ్చారు. చందర్లపాడు మండలం చందర్లపాడు గ్రామంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ “అంబేద్కర్ కేవలం రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాకుండా సామాజిక న్యాయానికి దిశానిర్దేశం చేసిన మహానేత. కుల వివక్ష, అంటరానితనం నిర్మూలన కోసం ఆయన చేసిన పోరాటం చిరస్థాయిగా నిలిచిపోతుంది. మహిళలు, అణగారిన వర్గాల అభ్యున్నతికి రాజ్యాంగం ఆయన అందించిన అమూల్య మైన వరం” అని పేర్కొన్నారు. సమానత్వం–సోదరభావం అంబేద్కర్ ఆశయాల మూలం అని, ఆ విలువలను ప్రతి పౌరుడు ఆచరించాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో లాల్ బహదూర్ లెఫ్ట్ కెనాల్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ కోట వీరబాబు, కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

