సెప్టెంబర్ 21 పున్నమి ప్రతినిధి @
అంబేడ్కర్ స్టడీ సర్కిళ్ల ద్వారా నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ యువతకు పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు అభ్యర్థుల నుంచి ఈ నెల 24 నుంచి అక్టోబరు 6 వరకూ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సర్కిల్ డైరెక్టర్ ప్రసన్న వెంకటేశ్ తెలిపారు. తిరుపతి, విశాఖపట్నం కేంద్రాలుగా శిక్షణ ఉంటుందని, శిక్షణ కాలంలో అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తామని శనివారం ఓ ప్రకటనలో ఆయన తెలిపారు. “ఐబీపీఎస్, ఆర్.ఆర్.బి, ఎస్ఎస్సీ తదితర పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తాం. ఆసక్తిగల అభ్య ర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. వీరికి ఆయా జిల్లా కేంద్రాల్లో అక్టో బరు 12న స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. మరిన్ని వివరాలకు 99496 86306 నంబరులో సంప్రదించాలి” అని ఆయన సూచించారు. ఉచిత శిక్షణ ఇవ్వడానికి ఆసక్తిగల సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానించినట్లు వెల్లడించారు.

అంబేడ్కర్ స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచిత శిక్షణ
సెప్టెంబర్ 21 పున్నమి ప్రతినిధి @ అంబేడ్కర్ స్టడీ సర్కిళ్ల ద్వారా నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ యువతకు పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు అభ్యర్థుల నుంచి ఈ నెల 24 నుంచి అక్టోబరు 6 వరకూ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సర్కిల్ డైరెక్టర్ ప్రసన్న వెంకటేశ్ తెలిపారు. తిరుపతి, విశాఖపట్నం కేంద్రాలుగా శిక్షణ ఉంటుందని, శిక్షణ కాలంలో అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తామని శనివారం ఓ ప్రకటనలో ఆయన తెలిపారు. “ఐబీపీఎస్, ఆర్.ఆర్.బి, ఎస్ఎస్సీ తదితర పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తాం. ఆసక్తిగల అభ్య ర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. వీరికి ఆయా జిల్లా కేంద్రాల్లో అక్టో బరు 12న స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. మరిన్ని వివరాలకు 99496 86306 నంబరులో సంప్రదించాలి” అని ఆయన సూచించారు. ఉచిత శిక్షణ ఇవ్వడానికి ఆసక్తిగల సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానించినట్లు వెల్లడించారు.

