*మంచి మనిషి మాయమైపోయాడు*
పల్లవి-
మాయమయి పోతున్నడన్నావు మనిషి
నీవు మాయం అయిపోతే ఎట్లాగన్నా
ఇంత మందికి తట్టి లేపితివి అన్న
నీవు నిద్రలోకి వెళ్ళిపోతే ఎలా అన్న
” మాయమయి”
ప్రకృతి మూగబోతోంది అన్న
సెలయేళ్లు గలగలలుతగ్గాయి అన్న
కవి కలాలు ఆగిపోయాయి అన్న
కవి గళాలు మూగబోతాయి అన్న
” మాయమయి”
పల్లె అందాలు ఎవరు వర్ణిస్తారు
మానవతావాదం ఎవరు వివరిస్తారు
తెలంగాణ తల్లిని ఎవరు ఓదారుస్తారు
ఎంత పని చేసావు అన్న మాకు చింతలే మిగిల్చావు అన్న.
” మాయమయి”
ఎల్లయ్యగా అవతరించావు నీవు
అందెశ్రీ గా అందరికీ పరిచయమైనావు
ప్రకృతి నుంచి పాఠాలు చదివావు
జీవితాల నుంచి గుణపాఠాలు నేర్చావు
“మాయమయి ”
జనపదంలో పుట్టి ,జానపదాన్ని పట్టి
జనం మెచ్చిన పాటలు తో పేరు పొందావు
తెలంగాణ ఉద్యమంలో కీలకమయ్యావు
నోటి మాటలతో అగ్నిమంచును కురిపించావు.
“మాయమయి”
ఇట్లు
రచన-లోకనాథం సత్యానందం, మాస్టారు,
శ్రీకాకుళం, ఫోన్ -9182863928.
(వారి పవిత్ర ఆత్మ కు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను.)


