తొట్టంబేడు నవంబర్ 04 , పున్నమి న్యూస్ : : శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలోని పెద్ద కన్నలి పంచాయతీ కొత్త కన్నలి గ్రామ సమీపంలోని స్మశాన వాటిక వర్షపు నీరు చేరి చెరువు లాగా మారింది. దీంతో ఎవరైనా మరణిస్తే ఇక్కడ అంతిమయాత్ర చేయడానికి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్రతికినన్నాళ్లు కష్టాలు తప్ప లేదంటే మరణించిన తర్వాత కూడా భౌతికకాయాన్ని దహన సంస్కారాలు చేయాలంటే అవస్తలు తప్పడం లేదంటూ గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. ఈ స్మశానం రోడ్డుకి కింద ఉండడంతో వర్షం వస్తే మొత్తం నీటితో నిండిపోతుందని దీంతో మృతి చెందిన వారిని పూడ్చడానికి గుంత తీయాలన్నా కూడా అందులోకి వర్షపు నీరు చేరిపోవడంతో పూడ్చలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. గ్రామములో ఆదివారం గ్రామంలో ఒక వ్యక్తి మృతి చెందితే మృతదేహాన్ని పూడ్చడానికి గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొత్త కన్నలి సమీపంలోని ఎస్టీ కాలనీ వద్ద విశ్వ బ్రాహ్మణులకు సంబంధించిన స్మశానం పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయి ఉందని సంబందిత అధికారులు ఇకనైన స్పందించి స్మశాన వాటికలను బాగు చేయించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

అంతిమయాత్రకు కూడా తప్పని అవస్తలు ..