Monday, 23 March 2026
  • Home  
  • అంతర్జాతీయ వేదికపై రైల్వే కోడూరు యువకుడికి అరుదైన గౌరవం
- అన్నమయ్య

అంతర్జాతీయ వేదికపై రైల్వే కోడూరు యువకుడికి అరుదైన గౌరవం

-ఏపీ యూత్ ఐకాన్’ అవార్డు అందుకున్న షేక్ మహమ్మద్ షాహిద్ -మహారాష్ట్ర ఔరంగాబాద్‌లో జరిగిన మానవ హక్కుల దినోత్సవ వేడుకలో ప్రశంసా పత్రం, కాంస్య పతకం అందజేత చిట్వేల్, డిసెంబర్ 11: పున్నమి ప్రతినిధి రైల్వే కోడూరు వాసి షేక్ మహమ్మద్ షాహిద్ సామాజిక సేవ, వినూత్న కార్యక్రమాలకు గుర్తింపుగా అంతర్జాతీయ వేదికపై అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో నిర్వహించిన అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఆయనకు ‘ఆంధ్రప్రదేశ్ యూత్ ఐకాన్’ అవార్డు లభించింది. -అవార్డు ప్రధానం: డిసెంబర్ 10వ తేదీన (బుధవారం) ఔరంగాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగిన ఈ అవార్డ్స్ వేడుక ప్రోగ్రాంలో షేక్ మహమ్మద్ షాహిద్ ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు.జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఎం.ఆర్.అన్సారీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ మస్తాన్ సాహెబ్ గారి ల చేతుల మీదుగా షేక్ మహమ్మద్ షాహిద్ ఈ అవార్డును స్వీకరించారు. అవార్డుతో పాటు ఆయనకు ప్రశంసా పత్రం మరియు కాంస్య పతకం కూడా అందజేయబడింది. -గుర్తింపు దేనికంటే? రైల్వే కోడూరు వాసి అయిన షేక్ మహమ్మద్ షాహిద్ సామాజిక రంగంలో, ముఖ్యంగా యువతను చైతన్యపరచడంలో చేసిన విశేష కృషికి ఫలితంగా ఈ అవార్డు లభించింది. ఆయన చేసిన కార్యక్రమాలు, సామాజిక బాధ్యత పట్ల ఆయనకున్న నిబద్ధతను జాతీయ స్థాయి వేదిక గుర్తించింది. మానవ హక్కుల పరిరక్షణలో యువత పాత్రను పెంచేందుకు, సమాజంలో మార్పు తెచ్చేందుకు ఆయన చేసిన కృషి ఈ గౌరవాన్ని దక్కించుకోవడంలో కీలకమైంది. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఈ అవార్డును అందుకోవడం పట్ల షేక్ మహమ్మద్ షాహిద్ హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు ఈ అరుదైన గౌరవం లభించడం పట్ల రైల్వే కోడూరు ప్రజలు, స్థానిక యువత, మిత్రులు అభినందనలు తెలియజేశారు.

-ఏపీ యూత్ ఐకాన్’ అవార్డు అందుకున్న షేక్ మహమ్మద్ షాహిద్

-మహారాష్ట్ర ఔరంగాబాద్‌లో జరిగిన మానవ హక్కుల దినోత్సవ వేడుకలో ప్రశంసా పత్రం, కాంస్య పతకం అందజేత

చిట్వేల్, డిసెంబర్ 11: పున్నమి ప్రతినిధి

రైల్వే కోడూరు వాసి షేక్ మహమ్మద్ షాహిద్ సామాజిక సేవ, వినూత్న కార్యక్రమాలకు గుర్తింపుగా అంతర్జాతీయ వేదికపై అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో నిర్వహించిన అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఆయనకు ‘ఆంధ్రప్రదేశ్ యూత్ ఐకాన్’ అవార్డు లభించింది.

-అవార్డు ప్రధానం:

డిసెంబర్ 10వ తేదీన (బుధవారం) ఔరంగాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగిన ఈ అవార్డ్స్ వేడుక ప్రోగ్రాంలో షేక్ మహమ్మద్ షాహిద్ ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు.జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఎం.ఆర్.అన్సారీ
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ మస్తాన్ సాహెబ్ గారి
ల చేతుల మీదుగా షేక్ మహమ్మద్ షాహిద్ ఈ అవార్డును స్వీకరించారు. అవార్డుతో పాటు ఆయనకు ప్రశంసా పత్రం మరియు కాంస్య పతకం కూడా అందజేయబడింది.

-గుర్తింపు దేనికంటే?

రైల్వే కోడూరు వాసి అయిన షేక్ మహమ్మద్ షాహిద్ సామాజిక రంగంలో, ముఖ్యంగా యువతను చైతన్యపరచడంలో చేసిన విశేష కృషికి ఫలితంగా ఈ అవార్డు లభించింది. ఆయన చేసిన కార్యక్రమాలు, సామాజిక బాధ్యత పట్ల ఆయనకున్న నిబద్ధతను జాతీయ స్థాయి వేదిక గుర్తించింది. మానవ హక్కుల పరిరక్షణలో యువత పాత్రను పెంచేందుకు, సమాజంలో మార్పు తెచ్చేందుకు ఆయన చేసిన కృషి ఈ గౌరవాన్ని దక్కించుకోవడంలో కీలకమైంది.
అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఈ అవార్డును అందుకోవడం పట్ల షేక్ మహమ్మద్ షాహిద్ హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు ఈ అరుదైన గౌరవం లభించడం పట్ల రైల్వే కోడూరు ప్రజలు, స్థానిక యువత, మిత్రులు అభినందనలు తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.