శ్రీకాళహస్తి అక్టోబర్27, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి పట్టణంలో ప్రజలు అంటువ్యాధులు ప్రబలకుండా అత్యంత జాగ్రత్త వహించాలని శ్రీరామ నగర్ కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బాలు సూచించారు. మంగళవారం నాడు స్థానిక అర్బన్ హెల్త్ సెంటర్ సిబ్బందితో డాక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …గత వారంగా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా కలుషితమైన నీరు కలుస్తమైన ఆహారం తీసుకోవడం వల్ల ప్రజలకు డయేరియా, టైఫాయిడ్, మలేరియా వంటి రోగాల బారిన పడే ప్రమాదం ఉందని వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే వేడి చేసిన నీరు తాగాలని, బయట తినుబండారాలు తినకూడదని అలాగే ఇళ్ల చుట్టుపక్కల నీరు నిల్వలు చేరకుండా చూసుకోవాలని అలా నీరు నిల్వ ఉంటే దోమలు వృద్ధి చెంది పట్టణ వాసులు డెంగ్యూ, మలేరియా వంటి రోగాల బారిన పడే అవకాశం ఉందని, పది నుంచి 15 రోజుల్లో లోపల ప్రసవం అయ్యే గర్భవతులను శ్రీ కాళహస్తి ఏరియా ఆసుపత్రికి ముందస్తుగా తరలించాలని సిబ్బందికి వైద్యులు బాలు ఈ సమావేశంలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

అంటువ్యాధులకు గురికాకుండా ప్రజల జాగ్రత్త పడాలి…. డాక్టర్ బాలు.