పువ్వాడ నాగేంద్ర కుమార్
పున్నమి ప్రతినిధి
తెలుగు వారి ప్రముఖ పండుగల్లో అత్యంత ముఖ్యమైన పండుగ సంక్రాంతి. మూడు రోజుల పాటు జరిగే ఈ పండుగలో తొలి రోజు భోగి, రెండో రోజు మకర సంక్రాంతి, మూడో రోజు కనుమను సంప్రదాయబద్ధంగా జరుపుకుంటారు. కొత్త అల్లుళ్ల రాకతో గ్రామగ్రామాన పండుగ వాతావరణం నెలకొంది.
నూతన జిల్లాగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలోని పామూరు మండలం నుచ్చుపొద గ్రామంలో సంక్రాంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పున్నమి ఖమ్మం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ పువ్వాడ నాగేంద్ర కుమార్ సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు.
భోగి పండుగ రోజున తెల్లవారుజామున 4 గంటలకే భోగి మంటలు వెలిగించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. గ్రామస్తులు సాంప్రదాయ వస్త్రధారణతో, హర్షాతిరేకాలతో పండుగను ఘనంగా జరుపుకున్నారు. భోగితో ప్రారంభమైన ఈ సంక్రాంతి సంబరాలు కనుమ పండుగతో ముగియనున్నాయి. గ్రామమంతా పండుగ శోభతో కళకళలాడుతోంది.
Uploaded Video:



