Thursday, 5 February 2026
  • Home  
  • అంగన్వాడి భవనానికి మహర్దశ.
- నాగర్‌కర్నూల్

అంగన్వాడి భవనానికి మహర్దశ.

అంగన్వాడి భవనానికి మహర్దశ. వెల్దండ డిసెంబర్ 28 : వెల్దండ మండల పరిధిలోని బొల్లంపల్లి గ్రామపంచాయతీలో గ్రామ సర్పంచ్ సత్తూరి ప్రసాద్ గౌడ్ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. సర్పంచిగా పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి గ్రామంలో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించారు. గ్రామపంచాయతీ పరిధిలోని అంక మోనికుంట గ్రామంలో నిరుపయోగంగా ఉన్న అంగన్వాడి భవనంలో గల పిచ్చి మొక్కలను, చెట్లను తొలగించి, అంగన్వాడి భవనానికి మహర్దశ కల్పించారు. అంగన్వాడి కేంద్రాన్ని గత 8 సంవత్సరాల కింద గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలోకి మార్చడం జరిగింది. నాటి నుండి నిరుపయోగంగా ఉండి, పిచ్చి మొక్కలతో కూరుకుపోయి ఉన్న సమస్యను గ్రామ సర్పంచ్ జెసిబి సహాయంతో మొక్కలను తీసివేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంగన్వాడి భవనానికి మరమ్మతులు చేయించి, అవసరమగు డోర్లు కిటికీలు బిగించి, రంగులు వేయిస్తానని చెప్పారు. సర్పంచ్ పలు అభివృద్ధి పనులు చేస్తున్నందున గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సత్తూరి ప్రసాద్ గౌడ్, ఉప సర్పంచ్ చొప్పరి రామకృష్ణ, గ్రామస్తులు నరసింహ, సత్తూరి శేఖర్, మొకురాల శ్రీకాంత్, వంశీ, జంగయ్య, కిరణ్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

అంగన్వాడి భవనానికి మహర్దశ.

వెల్దండ డిసెంబర్ 28 :
వెల్దండ మండల పరిధిలోని బొల్లంపల్లి గ్రామపంచాయతీలో గ్రామ సర్పంచ్ సత్తూరి ప్రసాద్ గౌడ్ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. సర్పంచిగా పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి గ్రామంలో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించారు. గ్రామపంచాయతీ పరిధిలోని అంక మోనికుంట గ్రామంలో నిరుపయోగంగా ఉన్న అంగన్వాడి భవనంలో గల పిచ్చి మొక్కలను, చెట్లను తొలగించి, అంగన్వాడి భవనానికి మహర్దశ కల్పించారు. అంగన్వాడి కేంద్రాన్ని గత 8 సంవత్సరాల కింద గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలోకి మార్చడం జరిగింది. నాటి నుండి నిరుపయోగంగా ఉండి, పిచ్చి మొక్కలతో కూరుకుపోయి ఉన్న సమస్యను గ్రామ సర్పంచ్ జెసిబి సహాయంతో మొక్కలను తీసివేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంగన్వాడి భవనానికి మరమ్మతులు చేయించి, అవసరమగు డోర్లు కిటికీలు బిగించి, రంగులు వేయిస్తానని చెప్పారు. సర్పంచ్ పలు అభివృద్ధి పనులు చేస్తున్నందున గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సత్తూరి ప్రసాద్ గౌడ్, ఉప సర్పంచ్ చొప్పరి రామకృష్ణ, గ్రామస్తులు నరసింహ, సత్తూరి శేఖర్, మొకురాల శ్రీకాంత్, వంశీ, జంగయ్య, కిరణ్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.