కేంద్ర ప్రభుత్వ గ్యాస్ సబ్సిడీ పొందాలంటే ప్రతి సంవత్సరం ఈ–KYC చేయించుకోవాలి అని ఆయిల్ కంపెనీలు స్పష్టం చేశాయి.
ఈ–KYC చేయడానికి మార్గాలు:
1️⃣ ఇండియన్ ఆయిల్ / హెచ్పీ / భారత్ పెట్రోలియం యాప్ ద్వారా
2️⃣ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్లో
3️⃣ సిలిండర్ డెలివరీ చేసే బాయ్ వద్ద ఉన్న యాప్ ద్వారా
సేవ ఉచితం | బయోమెట్రిక్ ఆధార్ ధృవీకరణ తప్పనిసరి
ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఒకసారి చేయాలి.
సంవత్సరానికి గరిష్టంగా 9 సిలిండర్లకే సబ్సిడీ, అందులో 8వ, 9వ సిలిండర్ల సబ్సిడీ KYC పూర్తి అయ్యే వరకు నిలిపి వేయబడుతుంది.
మార్చి 31లోపు పూర్తి చేయకపోతే సబ్సిడీ రద్దవుతుంది.
సరఫరా కొనసాగుతుంది కానీ రాయితీ రాదు.


