ఆదివారం హైదరాబాద్లో కొప్పుల వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీకమాసం సందర్భంగా నిర్వహించిన పిక్నిక్ కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ పి వి జి కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సందర్భంగా మాట్లాడుతూ పి వి జి కుమార్
“ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువకిశోరం నారా లోకేశ్ బాబు కొప్పుల వెలమల అభివృద్ధికి, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నందుకు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను” అని పేర్కొన్నారు.
అలాగే ఆయన మాట్లాడుతూ—
“తెలంగాణ ప్రభుత్వం కొప్పుల వెలమలను బిసి జాబితా నుండి తొలగించి ఓ సి కేటగిరీలో చేరించడం చాలా బాధాకరం. ఈ సమస్యను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి, మన వర్గ హక్కుల సాధన కోసం కృషి చేస్తాను” అని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో సంఘాధ్యక్షులు బాబురావు, నూకరాపు సూర్యప్రకాశరావు సహా ఇతర పెద్దలు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


