Monday, 16 March 2026
  • Home  
  • షేడ్స్! – చిత్తలూరి…………..(ఛాలెంజిలు విసురుకుంటూ వినోదం పంచుతున్న సినీ సెలెబ్రిటీల కొన్ని వీడియాలను చూశాక..)
- Featured - Others

షేడ్స్! – చిత్తలూరి…………..(ఛాలెంజిలు విసురుకుంటూ వినోదం పంచుతున్న సినీ సెలెబ్రిటీల కొన్ని వీడియాలను చూశాక..)

షేడ్స్! – చిత్తలూరి బాగుంది బాబయ్యా చాలా బాగుంది బ్లాక్ బస్టరైన భారీ బడ్జెట్ సినిమాలా వుంది ఇల్లు ఊడ్చటం అంట్లు తోమటం వంట చేయటం పక్క బట్టలు సర్దటం పైపుతో నీళ్లు కొడుతూ నేలంతా శుభ్రం‌చేయటం మీ బోటి పెద్దోళ్లు మాబోటి వాళ్ల పనులు చేస్తూ కనిపించటం ముచ్చటగా వుంది ఊహించని విధంగా ఒక చిన్న సినిమా సూపర్ హిట్టయినంత సంతోషంగా వుంది చిన్న చిన్న ఛాలెంజిలు విసురుకుంటూ మాకింత పెద్ద వినోదాన్ని పంచటం బాగుంది బాబయ్యా చాలా చాలా బాగుంది అయితే కాలు బయట పెట్టని ఈ క్వారంటైన్ల కాలంలో వినోదాన్ని పంచుతున్న మీ ఈ ఛాలెంజిల సంగతేమోగానీ ఎంత చాకిరీ చేసినా మాబోటి పేదలకు నిత్యం బతుకే ఒక ఛాలెంజ్ ఇంట్లోనే బందీయైన ఇట్లాంటి సంక్షోభ సమయంలో బతకటమే ఒక పెద్ద ఛాలెంజ్ అందుకే మీ ఛాలెంజిల్లో చిన్న మార్పు కోరుకుంటున్నాం బాబయ్యా మా పేదల బతుకులు మార్చే ఊహ చేస్తున్నాం బాబయ్యా వేషాల్లేక వేసారిపోతున్న మీ తోటి కార్మికుల పొట్ట నింపే ఛాలెంజిలిసురుకోండి ఈ కరోనా కష్టకాలంలో గడప దాటితేగానీ పూట గడవని ఎంతో మంది నిరుపేదల కడుపు నింపే దాతృత్వాలకై ఛాలెంజ్ విసురుకోండి ఈ లాక్ డౌన్ల లాకులెత్తాక వరద నీటిలా పోటెత్తే సామాన్య జనం రేపటి బతుకు సమస్యలకు కొత్త మార్గాలనన్వేషించే ఛాలెంజిలు విసురుకోండి అప్పుడింకా బాగుంటుంది బాబయ్యా చాలా చాలా బాగుంటుంది చిన్న బడ్జెట్ తో తీసిన సినిమా భారీ కలెక్షన్లు వసూలు చేసినంత అద్భుతంగానూ ఆనందంగానూ వుంటుంది మనిషిలోని రక రకాల షేడ్స్ ని ఈస్ట్ మన్ కలర్ లో కళ్లకు కడుతున్న ఈ కరోనా సంక్షోభ కాలం, మీలాంటి సెలబ్రిటీల ఛాలెంజులకి స్ఫూర్తివంతమైన ఒక కొత్త అర్థాన్నీ ఇచ్చినట్టుంటుంది! (ఛాలెంజిలు విసురుకుంటూ వినోదం పంచుతున్న సినీ సెలెబ్రిటీల కొన్ని వీడియాలను చూశాక..) – చిత్తలూరి 8247432521

షేడ్స్!
– చిత్తలూరి

బాగుంది బాబయ్యా

చాలా బాగుంది
బ్లాక్ బస్టరైన
భారీ బడ్జెట్ సినిమాలా వుంది

ఇల్లు ఊడ్చటం
అంట్లు తోమటం
వంట చేయటం
పక్క బట్టలు సర్దటం
పైపుతో నీళ్లు కొడుతూ
నేలంతా శుభ్రం‌చేయటం

మీ బోటి పెద్దోళ్లు
మాబోటి వాళ్ల
పనులు చేస్తూ కనిపించటం
ముచ్చటగా వుంది
ఊహించని విధంగా
ఒక చిన్న సినిమా
సూపర్ హిట్టయినంత
సంతోషంగా వుంది

చిన్న చిన్న ఛాలెంజిలు విసురుకుంటూ
మాకింత పెద్ద వినోదాన్ని పంచటం
బాగుంది బాబయ్యా
చాలా చాలా బాగుంది

అయితే
కాలు బయట పెట్టని
ఈ క్వారంటైన్ల కాలంలో
వినోదాన్ని పంచుతున్న
మీ ఈ ఛాలెంజిల సంగతేమోగానీ

ఎంత చాకిరీ చేసినా
మాబోటి పేదలకు
నిత్యం బతుకే ఒక ఛాలెంజ్
ఇంట్లోనే బందీయైన
ఇట్లాంటి సంక్షోభ సమయంలో
బతకటమే ఒక పెద్ద ఛాలెంజ్

అందుకే
మీ ఛాలెంజిల్లో
చిన్న మార్పు కోరుకుంటున్నాం
బాబయ్యా
మా పేదల బతుకులు మార్చే
ఊహ చేస్తున్నాం బాబయ్యా

వేషాల్లేక వేసారిపోతున్న
మీ తోటి కార్మికుల పొట్ట నింపే
ఛాలెంజిలిసురుకోండి

ఈ కరోనా కష్టకాలంలో
గడప దాటితేగానీ పూట గడవని
ఎంతో మంది నిరుపేదల
కడుపు నింపే దాతృత్వాలకై
ఛాలెంజ్ విసురుకోండి

ఈ లాక్ డౌన్ల లాకులెత్తాక
వరద నీటిలా పోటెత్తే
సామాన్య జనం
రేపటి బతుకు సమస్యలకు
కొత్త మార్గాలనన్వేషించే
ఛాలెంజిలు విసురుకోండి

అప్పుడింకా బాగుంటుంది
బాబయ్యా
చాలా చాలా బాగుంటుంది
చిన్న బడ్జెట్ తో తీసిన సినిమా
భారీ కలెక్షన్లు వసూలు చేసినంత
అద్భుతంగానూ
ఆనందంగానూ వుంటుంది

మనిషిలోని రక రకాల షేడ్స్ ని
ఈస్ట్ మన్ కలర్ లో కళ్లకు కడుతున్న
ఈ కరోనా సంక్షోభ కాలం,
మీలాంటి సెలబ్రిటీల ఛాలెంజులకి
స్ఫూర్తివంతమైన ఒక
కొత్త అర్థాన్నీ ఇచ్చినట్టుంటుంది!

(ఛాలెంజిలు విసురుకుంటూ వినోదం పంచుతున్న సినీ సెలెబ్రిటీల కొన్ని వీడియాలను చూశాక..)

– చిత్తలూరి
8247432521

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.