
భగవాన్ శ్రీశ్రీశ్రీ సత్యసాయిబాబా వారి శతవత్సర జన్మదిన వేడుకల సందర్భంగా పిన్నింటిపేట శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నవంబర్ 8 రాత్రి అఖండ భజన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది.స్వామి వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో జరిగిన ఈ ఆధ్యాత్మిక వేడుకలో పొట్నూరు లక్ష్మి సాయి భక్త జన బృందం రాత్రి 11 గంటల నుండి 1 గంట వరకు హృదయాన్ని హత్తుకునే భజనలతో స్వామి నామస్మరణను కొనసాగించారు.
ఈ కార్యక్రమాన్ని సమితి కన్వీనర్ పొట్నూరు రత్నాకర్ రావు గారు సమన్వయం చేశారు. ఆయన మాట్లాడుతూ భగవాన్ సత్యసాయి బాబా మనకు చూపించిన సేవామార్గం సమాజానికి స్ఫూర్తి. భజనల ద్వారా మనసు పవిత్రమవుతుంది, సమాజంలో శాంతి ప్రసరిస్తుంది అన్నారు.ఈ సందర్భంగా స్థానిక భక్తులు, మహిళా మండలి సభ్యులు, యువసేవాదళం ప్రతినిధులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి పాదసేవలో తమ భక్తిని వ్యక్తం చేశారు.
💐🙏 ఓం శ్రీ సాయిరాం 🙏💐

