Saturday, 12 July 2025
  • Home  
  • వృత్తి జీవితం – 6
- Featured - బిజినెస్

వృత్తి జీవితం – 6

ఉద్యోగుల మానసిక ఆరోగ్యం – 6 వ భాగం వినడం ద్వారా మానసిక ఆరోగ్యం ! శ్రద్ధగా వినడం అనేది కమ్యూనికేషన్‌ లో అన్నింటికంటే ముఖ్యమైన కళ ! కమ్యూనికేషన్‌కి 4 స్థంభాలు! రాయడం, చదవడం, మాట్లా డడం, వినడం. మాట్లాడడం కంటే కూడా ముఖ్యమైనది వినడం . ఇది అలవరుచుకుంటే, మనకి వత్తి జీవితంలోనూ, కుటుంబ జీవితం లోనూ కూడా చాలా ఉపయోగ పడుతుంది. మన సత్సంబంధ బాంధవ్యాలు మెరుగు పడ తాయి. తద్వారా ఉపశాంతి, సంతోషం. తద్వారా మన మానసిక ఆరోగ్యం. ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నవి . నిశితంగా వినడంలోని ముఖ్యాంశాలు. 1. చెప్పే వారి వైపు వినే వారు చూడడం మొదటి స్టెప్పు ( అలా అని మనం తదేకంగా గ్రుచ్చి గ్రుచ్చి చూస్తూ ఉంటే, ఆ చెప్పే వారు స్త్రీ లు అయితే, వారు ఇబ్బంది పడవచ్చు! జాగ్రత్త ! చెప్పే వారు స్త్రీలు అయితే, సూది లాంటి చూపులతో గ్రుచ్చెయ్యకండి మరి! కొంచెం గ్యాపు ఇచ్చి అటు ఇటు చూస్తూ వినండి!) 2.అవతలి వారు చెప్పేటప్పుడు ‘ఊ’ కొట్టడం, తల ఊపడం, వారు చెప్పినది కొంచెం రిపీట్‌ చేసి, మనం విన్నాము అన్న నమ్మకం కలిగించడం. 3. సూటి ప్రశ్నలు అడగడం . సరి అయిన ప్రశ్నలు అడగడం . కానీ ఇది చాలా సున్నితం గా చేయాలి . మనకి సమస్య చెప్పే వారు, మనకి పూర్తి వివరాలు చెప్ప డానికి ఇష్ట పడక పోవచ్చు. కొన్ని విషయాలు గోప్యంగా ఉం చవచ్చు. వారు ఎంత వరకు చెప్పడానికి ఇష్ట పడతారో, అంతవరకే ప్రశ్నలు అడగాలి. 4. ఎవరైనా సహోద్యోగి తమ బాధలు చెప్పినప్పుడు, పూర్తి గా విని, వారు చెప్పిన దానిలో, కీలక మైన పదాలు తిరిగ్‌ రిపీట్‌ చెయ్యడం. దాని వలన వారికి మనం విన్నామని నమ్మకం కలుగుతుంది. మన అవగాహన కూడా పెరుగుతుంది. అవతలి వారు చెప్పేది విన్న తరువాత , వారి దగ్గర లేనిదీ, మనకి తెలిసినదీ, వారిగి సహాయ పడగలదీ అయిన సమాచారాన్ని వారికి ఇవ్వడం. మీకు తెలిసిన డాక్టర్‌ పేరు కావచ్చు, వారి బిడ్డ ని చేర్పించాలి అనుకున్న పాఠశాలలో మీకు తెలిసిన వ్యక్త్‌ పని చేస్తూ ఉండవచ్చు . ఇలాంటి రిఫరెన్సు కి సంబంధించిన సహాయం కావచ్చు. కేవలం ‘వినడం’ ద్వారా ఉద్యోగుల మానసిక ఆరోగ్యం కుదుట పడుతుందా ? ఖచ్చితంగా కుదుట పడుతుంది ! ‘ వినడం ‘ అనే ప్రక్రియ ద్వారా, మనస్సు ప్రక్షాళనం అవుతుంది ఇతరులు తమ బాధలు చెప్పేట ప్పుడు, మన స్వంత ఫీలింగ్స్‌ని అదుపులో పెట్టుకోవడం అవసరం ! అవతలి వారు తమ బాధలు చెబుతున్నప్పుడు , కొన్ని విషయాలు మనకి ఆశ్చర్యం కలిగించేవిగా , లేదా మనని నిర్ఘాంత పరిచేలా ఉండవచ్చు. కానీ, వినే ప్రక్రియలో , మన భావోద్వేగాలు, వెనువెంటనే ప్రకటించక పోవడమే మంచిది .. ఇంకో విషయం ఏమిటంటే, అవతలి వారు తమ సమస్యను మనకి చెప్పేటప్పుడు మనం విని వెనువెంటనే తక్షణ పరిష్కారాల లిస్టు చదవక పోవడం. చాలా మందికి తక్షణ పరిష్కారం అవసరం లేదు. వారి బాధని వినే వారు మాత్రమే కావాలి ! మనం చెప్పే ఇన్స్‌ స్టంట్‌ సొల్యూషన్‌ లు వారికి తట్ట లేదనీ కాదు. పరిష్కారానికి వారు ఇప్పటి దాకా ఏమేమి చేశారో వారినే అడిగి , ఆ తరువాత మాత్రమే మనకి తోచిన సలహా ఇవ్వడం మంచిది! ఒక ఆనంద కరమైన విషయం ఏమిటంటే, ఉద్యోగంలో, వ్యాపారంలో వత్తిడికీ, మానసిక సమస్యకూ గురి అయిన వారిలో 70 శాతం మంది కోలుకుంటారు ! వారి చుట్టు పక్కల వారు అర్ధం చేసుకుని సహానుభూతితో సపోర్టు చేస్తే! పైగా, ఉద్యోగంలో మానసిక అనారోగ్యం అనేది – ఏళ్ళ తరబడి ఉండదు . ఒక్కో సారి మనకి నచ్చని ఒక సంఘట వల్ల రావచ్చు. ఇష్టం లేని బదిలీయో, లేక ఇష్టం లేని బాస్‌ క్రింద పని చేయడమో, అనుకున్న ప్రమోషన్‌ / ఇంక్రిమెంటు రాక పోవడమో, ఇలా. ఆ సమయంలో ఆ ఎదురు దెబ్బని సరిగా ఎదుర్కొంటే, మళ్ళీ, ఉద్యోగ / వ్యాపార జీవితం సజావుగా నడవ వచ్చు! ఒక్కోసారి సమస్యలకి పరిష్కారమే ఉండక పోవచ్చు ! పరిష్కారం లేని సమస్యలు ఎన్నో ! అలాంటప్పుడు కలిగిన బాధ ని , దుఃఖాన్నీ జీర్ణం చేసుకుని కొత్త జీవితం ప్రారంభించడమే! ఉదాహరణకి , విడాకులు కావచ్చు . లేదా, సంస్థ నష్టాల్లో ఉందని వేల మందికి ” స్వచ్చంద విరమణ” (!!) ఇచ్చీ ఇంటికి పంపించ వచ్చు! మళ్ళీ అదే సంస్థ లో అదే ఉద్యోగం రాదు. మళ్ళీ ఆ జీతం రాక పోవచ్చు ! ఉన్న డబ్బు ని పొదుపు చేసుకుని, మరో చోట ఇంకోపనో, రిస్కు తక్కువ ఉన్న వ్యాపారమో ప్రారంభించ డమే ! మానసిక అనారోగ్యం అనుకోని సమస్యల వల్ల వస్తుంది. కానీ అన్ని సమస్యలకి పరిష్కా రాలు ఉండవు. పరిష్కారం లేని సమస్యల గురించి , మార్చ లేని గతాన్ని గురించి అతిగా వ్యధ పడకుండా , కొత్త జీవితాన్ని మరో చోట ప్రారంభించడమే పరిష్కారం ! మీ ప్రతి స్పందన తెలియజేయ వలసిన ఇ- మెయిల్‌ : essence.training@ yahoo.com, punnami.news @ gmail. com.

ఉద్యోగుల మానసిక ఆరోగ్యం – 6 వ భాగం
వినడం ద్వారా మానసిక ఆరోగ్యం !

శ్రద్ధగా వినడం అనేది కమ్యూనికేషన్‌ లో అన్నింటికంటే ముఖ్యమైన కళ ! కమ్యూనికేషన్‌కి 4 స్థంభాలు! రాయడం, చదవడం, మాట్లా డడం, వినడం. మాట్లాడడం కంటే కూడా ముఖ్యమైనది వినడం . ఇది అలవరుచుకుంటే, మనకి వత్తి జీవితంలోనూ, కుటుంబ జీవితం లోనూ కూడా చాలా ఉపయోగ పడుతుంది. మన సత్సంబంధ బాంధవ్యాలు మెరుగు పడ తాయి. తద్వారా ఉపశాంతి, సంతోషం.
తద్వారా మన మానసిక ఆరోగ్యం. ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నవి .
నిశితంగా వినడంలోని ముఖ్యాంశాలు.
1. చెప్పే వారి వైపు వినే వారు చూడడం మొదటి స్టెప్పు ( అలా అని మనం తదేకంగా గ్రుచ్చి గ్రుచ్చి చూస్తూ ఉంటే, ఆ చెప్పే వారు స్త్రీ లు అయితే, వారు ఇబ్బంది పడవచ్చు! జాగ్రత్త ! చెప్పే వారు స్త్రీలు అయితే, సూది లాంటి చూపులతో గ్రుచ్చెయ్యకండి మరి! కొంచెం గ్యాపు ఇచ్చి అటు ఇటు చూస్తూ వినండి!)
2.అవతలి వారు చెప్పేటప్పుడు ‘ఊ’ కొట్టడం, తల ఊపడం, వారు చెప్పినది కొంచెం రిపీట్‌ చేసి, మనం విన్నాము అన్న నమ్మకం కలిగించడం.
3. సూటి ప్రశ్నలు అడగడం . సరి అయిన ప్రశ్నలు అడగడం . కానీ ఇది చాలా సున్నితం గా చేయాలి . మనకి సమస్య చెప్పే వారు, మనకి పూర్తి వివరాలు చెప్ప డానికి ఇష్ట పడక పోవచ్చు. కొన్ని విషయాలు గోప్యంగా ఉం చవచ్చు. వారు ఎంత వరకు చెప్పడానికి ఇష్ట పడతారో, అంతవరకే ప్రశ్నలు అడగాలి.
4. ఎవరైనా సహోద్యోగి తమ బాధలు చెప్పినప్పుడు, పూర్తి గా విని, వారు చెప్పిన దానిలో, కీలక మైన పదాలు తిరిగ్‌ రిపీట్‌ చెయ్యడం. దాని వలన వారికి మనం విన్నామని నమ్మకం కలుగుతుంది. మన అవగాహన కూడా పెరుగుతుంది.
అవతలి వారు చెప్పేది విన్న తరువాత , వారి దగ్గర లేనిదీ, మనకి తెలిసినదీ, వారిగి సహాయ పడగలదీ అయిన సమాచారాన్ని వారికి ఇవ్వడం. మీకు తెలిసిన డాక్టర్‌ పేరు కావచ్చు, వారి బిడ్డ ని చేర్పించాలి అనుకున్న పాఠశాలలో మీకు తెలిసిన వ్యక్త్‌ పని చేస్తూ ఉండవచ్చు . ఇలాంటి రిఫరెన్సు కి సంబంధించిన సహాయం కావచ్చు.
కేవలం ‘వినడం’ ద్వారా ఉద్యోగుల మానసిక ఆరోగ్యం కుదుట పడుతుందా ? ఖచ్చితంగా కుదుట పడుతుంది ! ‘ వినడం ‘ అనే ప్రక్రియ ద్వారా, మనస్సు ప్రక్షాళనం అవుతుంది ఇతరులు తమ బాధలు చెప్పేట ప్పుడు, మన స్వంత ఫీలింగ్స్‌ని అదుపులో పెట్టుకోవడం అవసరం ! అవతలి వారు తమ బాధలు చెబుతున్నప్పుడు , కొన్ని విషయాలు మనకి ఆశ్చర్యం కలిగించేవిగా , లేదా మనని నిర్ఘాంత పరిచేలా ఉండవచ్చు. కానీ, వినే ప్రక్రియలో , మన భావోద్వేగాలు, వెనువెంటనే ప్రకటించక పోవడమే మంచిది ..
ఇంకో విషయం ఏమిటంటే, అవతలి వారు తమ సమస్యను మనకి చెప్పేటప్పుడు మనం విని వెనువెంటనే తక్షణ పరిష్కారాల లిస్టు చదవక పోవడం. చాలా మందికి తక్షణ పరిష్కారం అవసరం లేదు. వారి బాధని వినే వారు మాత్రమే కావాలి ! మనం చెప్పే ఇన్స్‌ స్టంట్‌ సొల్యూషన్‌ లు వారికి తట్ట లేదనీ కాదు. పరిష్కారానికి వారు ఇప్పటి దాకా ఏమేమి చేశారో వారినే అడిగి , ఆ తరువాత మాత్రమే మనకి తోచిన సలహా ఇవ్వడం మంచిది!
ఒక ఆనంద కరమైన విషయం ఏమిటంటే, ఉద్యోగంలో, వ్యాపారంలో వత్తిడికీ, మానసిక సమస్యకూ గురి అయిన వారిలో 70 శాతం మంది కోలుకుంటారు ! వారి చుట్టు పక్కల వారు అర్ధం చేసుకుని సహానుభూతితో సపోర్టు చేస్తే! పైగా, ఉద్యోగంలో మానసిక అనారోగ్యం అనేది – ఏళ్ళ తరబడి ఉండదు . ఒక్కో సారి మనకి నచ్చని ఒక సంఘట వల్ల రావచ్చు. ఇష్టం లేని బదిలీయో, లేక ఇష్టం లేని బాస్‌ క్రింద పని చేయడమో, అనుకున్న ప్రమోషన్‌ / ఇంక్రిమెంటు రాక పోవడమో, ఇలా. ఆ సమయంలో ఆ ఎదురు దెబ్బని సరిగా ఎదుర్కొంటే, మళ్ళీ, ఉద్యోగ / వ్యాపార జీవితం సజావుగా నడవ వచ్చు!
ఒక్కోసారి సమస్యలకి పరిష్కారమే ఉండక పోవచ్చు ! పరిష్కారం లేని సమస్యలు ఎన్నో ! అలాంటప్పుడు కలిగిన బాధ ని , దుఃఖాన్నీ జీర్ణం చేసుకుని కొత్త జీవితం ప్రారంభించడమే!
ఉదాహరణకి , విడాకులు కావచ్చు . లేదా, సంస్థ నష్టాల్లో ఉందని వేల మందికి ” స్వచ్చంద విరమణ” (!!) ఇచ్చీ ఇంటికి పంపించ వచ్చు!
మళ్ళీ అదే సంస్థ లో అదే ఉద్యోగం రాదు. మళ్ళీ ఆ జీతం రాక పోవచ్చు ! ఉన్న డబ్బు ని పొదుపు చేసుకుని, మరో చోట ఇంకోపనో, రిస్కు తక్కువ ఉన్న వ్యాపారమో ప్రారంభించ డమే !
మానసిక అనారోగ్యం అనుకోని సమస్యల వల్ల వస్తుంది. కానీ అన్ని సమస్యలకి పరిష్కా రాలు ఉండవు. పరిష్కారం లేని సమస్యల గురించి , మార్చ లేని గతాన్ని గురించి అతిగా వ్యధ పడకుండా , కొత్త జీవితాన్ని మరో చోట ప్రారంభించడమే పరిష్కారం !
మీ ప్రతి స్పందన తెలియజేయ వలసిన ఇ- మెయిల్‌ : essence.training@ yahoo.com, punnami.news @ gmail. com.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.