Monday, 23 March 2026
  • Home  
  • వీధి కుక్కల నియంత్రణ సిబ్బందికి యాంటీ రాబిస్ వ్యాక్సిన్.
- విశాఖపట్నం

వీధి కుక్కల నియంత్రణ సిబ్బందికి యాంటీ రాబిస్ వ్యాక్సిన్.

వీధి కుక్కల నియంత్రణ సిబ్బందికి యాంటీ రాబిస్ వ్యాక్సిన్. – సిటీ వెటర్నరీ అధికారి డాక్టర్ ఎల్.రవికుమార్ *విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:- * మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు వీధి కుక్కల నియంత్రణ సిబ్బందికి రాబిస్ వ్యాధి రాకుండా ముందస్తుగా యాంటీ రాబిస్ వ్యాక్సిన్ జీవీఎంసీ ప్రధాన కార్యాలయం సమావేశ మందిరంలో బుధవారం వేయడం జరిగిందని జీవీఎంసీ సిటీ వెటర్నరీ అధికారి డాక్టర్ ఎల్.రవికుమార్ గురువారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా సిటీ వెటర్నరీ అధికారి మాట్లాడుతూ జీవీఎంసీ పరిధిలోగల 50 మంది వీధి కుక్కలను పట్టుకునే సిబ్బంది కి, శస్త్ర చికిత్సలు నిర్వహించే వారికి రాబిస్ వ్యాధి రాకుండా ముందస్తుగా యాంటీ రాబిస్ వ్యాక్సిన్ టీకాను జంతు సంరక్షణ సేవా సంఘం సభ్యుల తో కలిసి వేయించడం జరిగిందని తెలిపారు. జీవీఎంసీ వెటర్నరీ సిబ్బంది వీధి కుక్కలను పట్టుకునేటప్పుడు, శస్త్ర చికిత్సలు నిర్వహించినప్పుడు మానవతా దృక్పథంతో ప్రవర్తించి పట్టుకోవాలని సిబ్బందికి ఆదేశించడమైనదని తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు వీధి కుక్కలకు ఆహారం పెట్టే సమయంలో ఆయా ప్రాంతాలలోని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు పాటించాలని జంతు సంరక్షణ సేవా సంఘ ప్రతినిధులకు, సభ్యులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సహాయ వైద్యాధికారి డాక్టర్ ఎన్.కిరణ్ కుమార్, జంతు సంరక్షణ సేవా సంఘం సభ్యులైన శారద, ప్రమోద్, కుసుమ, శ్రీదేవి, రవి తదితరులు పాల్గొన్నారు

వీధి కుక్కల నియంత్రణ సిబ్బందికి యాంటీ రాబిస్ వ్యాక్సిన్.

– సిటీ వెటర్నరీ అధికారి డాక్టర్ ఎల్.రవికుమార్

*విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:- * మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు వీధి కుక్కల నియంత్రణ సిబ్బందికి రాబిస్ వ్యాధి రాకుండా ముందస్తుగా యాంటీ రాబిస్ వ్యాక్సిన్ జీవీఎంసీ ప్రధాన కార్యాలయం సమావేశ మందిరంలో బుధవారం వేయడం జరిగిందని జీవీఎంసీ సిటీ వెటర్నరీ అధికారి డాక్టర్ ఎల్.రవికుమార్ గురువారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.

ఈ సందర్భంగా సిటీ వెటర్నరీ అధికారి మాట్లాడుతూ జీవీఎంసీ పరిధిలోగల 50 మంది వీధి కుక్కలను పట్టుకునే సిబ్బంది కి, శస్త్ర చికిత్సలు నిర్వహించే వారికి రాబిస్ వ్యాధి రాకుండా ముందస్తుగా యాంటీ రాబిస్ వ్యాక్సిన్ టీకాను జంతు సంరక్షణ సేవా సంఘం సభ్యుల తో కలిసి వేయించడం జరిగిందని తెలిపారు. జీవీఎంసీ వెటర్నరీ సిబ్బంది వీధి కుక్కలను పట్టుకునేటప్పుడు, శస్త్ర చికిత్సలు నిర్వహించినప్పుడు మానవతా దృక్పథంతో ప్రవర్తించి పట్టుకోవాలని సిబ్బందికి ఆదేశించడమైనదని తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు వీధి కుక్కలకు ఆహారం పెట్టే సమయంలో ఆయా ప్రాంతాలలోని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు పాటించాలని జంతు సంరక్షణ సేవా సంఘ ప్రతినిధులకు, సభ్యులకు ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో సహాయ వైద్యాధికారి డాక్టర్ ఎన్.కిరణ్ కుమార్, జంతు సంరక్షణ సేవా సంఘం సభ్యులైన శారద, ప్రమోద్, కుసుమ, శ్రీదేవి, రవి తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.