విశాఖలోని కాపులుప్పాడ ఐటీ హిల్స్‌లో ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు*
విశాఖపట్నం డిసెంబర్ 12 పున్నమి ప్రతినిధి:-
• 8,000 మంది ఉద్యోగులు పనిచేసేలా అత్యాధునిక వసతులతో క్యాంపస్ నిర్మాణం
• మొత్తం రూ.1,583 కోట్ల పెట్టుబడితో 2033 నాటికి 3 దశల్లో పూర్తి కానున్న కాగ్నిజెంట్ టెక్నాలజీస్ పూర్తి క్యాంపస్
• 2026 నాటికి మొదటి దశ నిర్మాణం పూర్తి చేసుకోనున్న కాగ్నిజెంట్
• అప్పటివరకు అద్దె కార్యాలయంలో కార్యకాలపాలు కొనసాగించనున్న కాగ్నిజెంట్
• ప్రధానంగా ఏఐ, మెషీన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజినీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్ వంటి ఆధునిక సాంకేతిక రంగాలపై కాగ్నిజెంట్ దృష్టి
• కాగ్నిజెంట్‌తో పాటు మరో 8 ఐటీ సంస్థలకు కూడా విశాఖలో క్యాంపస్‌లు ఏర్పాటుకు భూమిపూజ
• ముఖ్యమంత్రితో పాటు పాల్గొన్న ఐటీ, విద్యా శాఖా మంత్రి నారా లోకేష్, విశాఖ ఎంపీ భరత్, కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్
• త్వరలోనే విశాఖ నుంచి కార్యకలాపాలు ప్రారంభించనున్న టెక్ తమ్మిన, సత్వ డెవలపర్స్, ఇమాజిన్నోవేట్ టెక్ సొల్యూషన్స్ ఇండియా, ఫ్లూయెంట్ గ్రిడ్ లిమిటెడ్, మదర్సన్ టెక్నాలజీస్, క్వార్క్స్ టెక్నోసాఫ్ట్, ఏసీఎన్ హెల్త్ కేర్ ఆర్సీఎం సర్వీసెస్, నాన్రెల్ టెక్నాలజీస్ సంస్థలు
• ఈ సంస్థల ద్వారా రాష్ట్రానికి రూ. 3,740 కోట్ల పెట్టుబడులు, దాదాపు 41,700 మందికి ఉద్యోగావకాశాలు
• గూగుల్ రాకతో ఇప్పటికే డేటా సిటీగా ఎదుగుతున్న విశాఖ
• కాగ్నిజెంట్, టీసీఎస్ వంటి సంస్థలు ప్రారంభించడంతో విశాఖ వైపు ప్రముఖ ఐటీ కంపెనీల చూపు
• ప్రస్తుతం విశాఖలో 150కి పైగా టెక్ కంపెనీల కార్యకలాపాలు, రాష్ట్రంలో ఐటీ నిపుణులకు విస్తృతంగా పెరిగిన అవకాశాలు
• కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ 18 నెలల్లో ఒక్క విశాఖలోనే రూ.1.34 లక్షల కోట్ల భారీ పెట్టుబడులు

