Tuesday, 31 March 2026
  • Home  
  • వివాదాస్పదంగా మారిన మాల్ గ్రామపంచాయతీ
- E-పేపర్

వివాదాస్పదంగా మారిన మాల్ గ్రామపంచాయతీ

పున్నమి న్యూస్ ప్రతినిధి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఇన్చార్జి: 9640204826 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలం మాల్ గ్రామపంచాయతీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ పార్టీకి చెందిన మొదటి వార్డు మెంబర్ స్వాతి తన వార్డులో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పనులు చేపడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, తన కళ్లకు గంతలు కట్టుకుని గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట నిరసనకు దిగిన స్వాతి, ప్రజాప్రతినిధిగా కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. “వార్డు మెంబర్‌గా ఉన్న నన్ను కనీసం కొబ్బరికాయ కొట్టడానికి కూడా పిలవడం లేదు. నా వార్డులో ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది” అంటూ మీడియా ముందు వాపోయారు. అభివృద్ధి పనులపై సమాచారం ఇవ్వకపోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొంటూ, వెంటనే గ్రామపంచాయతీ కార్యదర్శి స్పందించి వివరణ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.

పున్నమి న్యూస్ ప్రతినిధి
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఇన్చార్జి:
9640204826

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలం మాల్ గ్రామపంచాయతీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ పార్టీకి చెందిన మొదటి వార్డు మెంబర్ స్వాతి తన వార్డులో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పనులు చేపడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో, తన కళ్లకు గంతలు కట్టుకుని గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట నిరసనకు దిగిన స్వాతి, ప్రజాప్రతినిధిగా కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. “వార్డు మెంబర్‌గా ఉన్న నన్ను కనీసం కొబ్బరికాయ కొట్టడానికి కూడా పిలవడం లేదు. నా వార్డులో ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది” అంటూ మీడియా ముందు వాపోయారు.
అభివృద్ధి పనులపై సమాచారం ఇవ్వకపోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొంటూ, వెంటనే గ్రామపంచాయతీ కార్యదర్శి స్పందించి వివరణ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.