శ్రీకాళహస్తి, మార్చి 15 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజవర్గ శాసనసభ సబ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి నేటి నుండి ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమవుతున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాయబోయే విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా, శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని విద్యార్థులు ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తులో కీలకమైన దశ అని, ఇప్పటి వరకు చేసిన కృషిని పరీక్షల ద్వారా ప్రతిబింబించుకునే అవకాశమని పేర్కొన్నారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు. హాల్ టికెట్ చూపిన విద్యార్థులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించడం, పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, నీడ వంటి అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థులు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి, సమయపాలన పాటిస్తూ ప్రశాంతంగా పరీక్షలు రాయాలని కోరుతూ, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పదో తరగతి విద్యార్థులందరూ మంచి ఫలితాలు సాధించాలని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు.

విద్యార్థులు పరీక్షలను ఆత్మవిశ్వాసంతో రాయాలి–ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి