Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

*విద్యార్థులకు నైతిక విలువల పై సదస్సు*

తిరుపతి (ఎస్వియు) ఆగస్టు 17 పున్నమి ప్రతినిధి

శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం లోని డైరెక్టరేట్ ఆఫ్ స్టూడెంట్ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అఫైర్స్ కోఆర్డినేటర్ మరియు సదస్సు సంచాలకులు డా. పత్తిపాటి వివేక్ ఆధ్వర్యంలో నైతిక విలువలు పై రెండు రోజుల అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని వర్సిటీ ఉపకులపతి డా. తాత నరసింహారావు, ఆచార్య భూపతి నాయుడు ప్రారంభించారు. ఇందులో భాగంగా మొదటి రోజు నైతిక విలువలు పెంచే నైపుణ్యాలను వక్తలు విసదీకరించడం జరిగింది. ఈ సందర్భంగా తిరుపతి ఐఐటి అధ్యాపకుడు ఆచార్య రఘురామరాజు మాట్లాడుతూ విద్యార్థి ప్రగతి సాధించడంలో తల్లిదండ్రులతో పాటు, నైతిక విలువలు సత్ప్రవర్తన కలిగిన విద్యార్థి జీవితం ఉన్నతమైనదిగా పేర్కొన్నారు. వి ఐ టి చెన్నై సైకాలజీ ఆచార్యులు ఆచార్య సుభశ్రీ వనమాలి ప్రసంగిస్తూ జీవితంలో ఉన్నత స్థానాలు చేరుకోవాలంటే నైతిక విలువలతో పాటు జీవిత నైపుణ్యాలు చాలా కీలకమైనవని, వాటిని విద్యార్థులు గ్రహించి నైతికతలో నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. ఎస్వి ఆర్ట్స్ కళాశాల సైకాలజీ అధ్యాపకురాలు డా.ఉమా రాణి మాట్లాడుతూ జీవితంలో ఉన్నతంగా జీవించడం అంటే నైతిక హక్కుల తో పాటు విలువలను పాటించడమే. మేవార్ లోని స్ట్రాటజిక్ స్టడీస్ శాఖ అధ్యాపకులు డా. గౌతమ్ సతీష్, ఆల్ ఇండియా రేడియో స్టేషన్ మాజీ మేనేజర్ ఎ. మల్లేశ్వర్, స్టేషన్ మేనేజర్ మాట్లాడుతూ సోషల్ మీడియా వ్యామోహంలో పడి విద్యార్థులు, యువత తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని తల్లిదండ్రులు బాధ్యతగా సోషల్ మీడియా యాప్స్ నుండి తమ బిడ్డల భవిష్యత్తుని ఆదుకోవాల్సిందిగా సూచించారు.
ఈ కార్యక్రమంలో డి.ఎస్.డబ్ల్యు డైరెక్టర్ ఆచార్య బి.వి. మురళీధర్, కోఆర్డినేటర్ డా.కళ్యాణ్, డా.రంజిత్ కుమార్, హరీష్, వలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *