పెనుగొండ క్షేత్రంలో జన్మించిన ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి మాత జన్మస్థలాన్ని “వాసవి పెనుగొండ”గా గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడం అభినందనీయమని యన్.టి.ఆర్. జిల్లా ఆర్యవైశ్య సంఘం నేత పారేపల్లి సాయిబాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా పెనుగొండ పట్టణంలో అధికారులు “వాసవి పెనుగొండ”గా సూచిక బోర్డు ఏర్పాటు చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఆర్యవైశ్యులను గౌరవిస్తూ ఈ కీలక తీర్మానం చేయించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఆర్యవైశ్యులకు పెద్దపీట వేస్తూ వారి మనోభావాలకు అనుగుణంగా పాలన సాగిస్తోందని కొనియాడారు.




