అనకాపల్లి (పున్నమి ప్రతినిధి) :
అనకాపల్లి జిల్లా యలమంచిలి, నియోజకవర్గం లో
ఉదయం నుండి వర్షం కురుస్తున్నా జనవాణి కార్యక్రమానికి లబ్ధిదారులు హాజరై తమ వినతులను శాసనసభ్యులు సుందరపు విజయకుమార్ కు అందజేశారు. సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు హాజరు కావడంతో కొన్ని వినతులను అక్కడకక్కడే పరిష్కరించి మరి కొన్ని వినతులను పరిశీలనకు తీసుకోవడం జరిగిందని, వర్షం వచ్చినా లబ్ధిదారులకు న్యాయం చేసేందుకు జన వాణిని కి హాజరు కావడం జరిగిందని ఎమ్మెల్యే విజయకుమార్ అన్నారు, ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ప్రభుత్వ అధికారులు లబ్ధిదారులు పాల్గొన్నారు.


