వ్యక్తి తన ఇంటి స్థలం విక్రయానికి చేసిన యోచనను చూసి.. ఔరా! అని ముక్కున వేలేసుకుంటున్నారు స్థానికులు.యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో రేకుల గదితో సహా 66 గజాల ఇంటి స్థలం అమ్మకానికి లక్కీడ్రా పద్ధతి పెట్టారు ఆ యజమాని.కొనుగోలుకు ఆసక్తి ఉన్నవారు రూ.500 విలువైన కూపన్ ను కొనుగోలు చేసి లక్కీ డ్రా లో పాల్గొనాలని జాతీయ రహదారి పక్కన, ఆ ఇంటి వద్ద ఫ్లెక్సీలు కట్టారు.అయితే స్థానిక మార్కెట్ ధర ప్రకారం ఈ స్థలం,గది విలువ రూ.16 లక్షలు ఉందని 3,000 కూపన్లు ముద్రించానని వాటిని కొనుగోలు చేసిన వారు దానిపై తమ వివరాలు రాసి ఆ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన డబ్బాలో వేయాలని కోరారు.నవంబర్ 2న లక్కీడ్రా తీస్తా అని తెలిపారు.ఏడాదిన్నర క్రితం ఈ ఇంటిని అమ్మకానికి పెట్టానని సరైన ధర రాలేదని తెలిపారు.నేను కట్టుకున్న మరో ఇంటికి నవంబర్ లో డబ్బులు చెల్లించాలని దీంతో తప్పక ఈ మార్గాన్ని ఎంచుకున్నా అని చెబుతున్నారు.
అది చట్టబద్ధం కాకున్నా..ఆలోచన కొత్తగా ఉందని స్థానికులు అంటున్నారు.

*లక్కీ డ్రా 500 రూపాయలకే సింగిల్ రూమ్ ఉన్న ఫ్లాట్*
వ్యక్తి తన ఇంటి స్థలం విక్రయానికి చేసిన యోచనను చూసి.. ఔరా! అని ముక్కున వేలేసుకుంటున్నారు స్థానికులు.యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో రేకుల గదితో సహా 66 గజాల ఇంటి స్థలం అమ్మకానికి లక్కీడ్రా పద్ధతి పెట్టారు ఆ యజమాని.కొనుగోలుకు ఆసక్తి ఉన్నవారు రూ.500 విలువైన కూపన్ ను కొనుగోలు చేసి లక్కీ డ్రా లో పాల్గొనాలని జాతీయ రహదారి పక్కన, ఆ ఇంటి వద్ద ఫ్లెక్సీలు కట్టారు.అయితే స్థానిక మార్కెట్ ధర ప్రకారం ఈ స్థలం,గది విలువ రూ.16 లక్షలు ఉందని 3,000 కూపన్లు ముద్రించానని వాటిని కొనుగోలు చేసిన వారు దానిపై తమ వివరాలు రాసి ఆ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన డబ్బాలో వేయాలని కోరారు.నవంబర్ 2న లక్కీడ్రా తీస్తా అని తెలిపారు.ఏడాదిన్నర క్రితం ఈ ఇంటిని అమ్మకానికి పెట్టానని సరైన ధర రాలేదని తెలిపారు.నేను కట్టుకున్న మరో ఇంటికి నవంబర్ లో డబ్బులు చెల్లించాలని దీంతో తప్పక ఈ మార్గాన్ని ఎంచుకున్నా అని చెబుతున్నారు. అది చట్టబద్ధం కాకున్నా..ఆలోచన కొత్తగా ఉందని స్థానికులు అంటున్నారు.

