కామారెడ్డిలో మాయాజాల దొంగల గారడి పోలీసు పంజాలో!
కామారెడ్డి, ఫిబ్రవరి 2, ( పున్నమి ప్రతినిధి ) :
ప్రాణాలు పోతాయి.. లంకె బిందెలు తీసేయకపో తే కుటుంబం మొత్తం మరణిస్తుంది!”ఈ భయ భ్రమలతో అమాయకులను మోసం చేసి లక్షలు దోచుకున్న మాయాగాడిని కామారెడ్డి పోలీసులకు పట్టుబట్టారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఐపిఎస్‌ల పర్యవేక్షణలో, అంతర్జిల్లా మోసగాడు కడమంచి నర్సింలు @ నర్సారెడ్డి చేతిలో రూ.7 లక్షల నగదు, విలాసవంతమైన కార్లు స్వాధీనం, ఇది కేవలం ఒక కేసు కాదు.. మూఢనమ్మకాల ఆయుధంతో పలు కుటుంబాలను బెదిరించిన ‘దొంగ బాబా’ గుట్టు రట్టు అయింది.
ఇది ఓన్నాజిపేట్‌లో మొదటి ఎపిసోడ్….
దుమ్మల్ల బీరవ్వ కుటుంబానికి బెదిరింపులు జన వరి 26న, నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం ఓన్నాజిపేట్ గ్రామంలో జరిగిన ఈ ‘బిగ్ మ్యాటర్ ట్విస్ట్.. దుమ్మల్ల బీరవ్వల ఇంటికి వచ్చిన ఈ మాయాగాడు, “వాస్తు దోషాలు, క్షుద్ర పూజలు, అతీంద్రియ శక్తులు” అని నటిస్తూ లంకె బిందెలు ఇంట్లో ఉన్నాయంటు భయం చూపించాడు. “ఇవి తీసేయకపోతే కుటుంబంలో మరణం ఖాయం!” అంటూ భయపెట్టి, పూజల పేరుతో మొత్తం రూ. 8,20,000 తీసుకుని ఫోన్లు కట్ చేసి పరార్ అయ్యాడు. బీరవ్వల ఫిర్యాదితో కామారెడ్డి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు. సాంకేతిక టూల్స్ తో విచారణలో, సిరిసిల్ల జిల్లా వేములవాడ మండ లం చిర్లవంచకు చెందిన నర్సారెడ్డి ముఖ్య నింది తుడిగా తేలాడు.
చిన్న మల్లారెడ్డి ఫ్లాష్‌బ్యాక్.. భిక్షాటన నుంచి దోపిడీకి షిఫ్ట్!
గతేడాది అక్టోబర్‌లో చిన్న మల్లారెడ్డి గ్రామంలో ఈ ‘సీరియల్ మోసగాడు’ స్పాట్ హీరో అయ్యాడు. భిక్షాటన పేరుతో వచ్చి, లాస్య కుటుంబంలో ఆరో గ్య సమస్యలు ఉన్నాయని ముందుగానే తెలిసి, సోదరుడు సురేష్‌కు కిడ్నీ, తల్లికి అనారోగ్యాలు వస్తాయని ‘అంచనా’ వేశాడు. నమ్మకం సంపాదిం చాడు. “లంకె బిందెలు కారణమే.. పూజలు చేయకపోతే ఎవరో చనిపోతారు!” అని భయపెట్టి రూ.14 లక్షల పూజా ఖర్చు చెప్పి, రూ.2,93,000 డబ్బులు బ్లాక్ మెయిల్ చేశాడు. మరో ఇద్దరు సహచరులతో కలిసి సదాశివనగర్, జనగామ జిల్లా కోడకండ్ల పోలీస్ పరిధిలోనూ ఇలాంటి నేరాలు చేసినట్లు ఆరోపణలు,
నిందితుడి బ్యాక్‌గ్రౌండ్.. భిక్షాటన నుంచి మాయా బాబా!
30 ఏళ్ల కడమంచి నర్సింలు (నర్సారెడ్డి), తండ్రి దుర్గయ్య, బుడగ జంగం (ఎస్సీ) కులం. వృత్తి భిక్షాటన అని చెప్పుకుని, బంగారం, నగదు, ఆన్ లైన్ ట్రాన్సాక్షన్లతో దోపిడీ చేస్తున్నాడు. పోలీసుల స్వాధీనం: రూ.7 లక్షల క్యాష్, మారుతి స్విఫ్ట్ డిజైర్ (TS02FL0625), హ్యుండాయ్ క్రెటా (TG23 9853), ఒక మొబైల్.
మిగిలిన ఇద్దరు పరారీలో.. త్వరలో పట్టుకుంటామని ఎస్పీ హామీ..
“మూఢనమ్మకాలు ఆయుధం కాకూడదు!”
అమాయకత్వాన్ని ప్రయోజనం చేసుకుని మూఢన మ్మకాలతో దోపిడీ చేస్తున్నారని ఎస్పీ రాజేష్ చంద్ర ఘాటుగా హెచ్చరించారు. “ఇలాంటి మోసాలు గుర్తిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా డయల్ 100కు సంప్రదించండి. జిల్లాలో ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్య లు తీసుకుంటామని అన్నారు.కామారెడ్డి పోలీసు లు మొత్తం జిల్లాను కవర్ చేసి, ఇలాంటి మాయా గాల్లను ట్రాక్ చేస్తు న్నారు. అమాయకులు భయప డకండి.. పోలీసు లే మీ బలం!


