అనకాపల్లి జిల్లా రేవు పోలవరం జడ్పీహెచ్ఎస్లో జాతీయ సైన్స్ దినోత్సవం ఘనంగా జరిగింది. హెచ్ఎం అరుణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు వినూత్న సైన్స్ ప్రాజెక్టులతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా C. V. రామన్ గారి రామన్ ఎఫెక్ట్ను వివరించి, శాస్త్రీయ దృక్పథం పెంపొందించుకోవాలని సూచించారు.



