Monday, 23 March 2026
  • Home  
  • మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న 49వ వార్డు కార్పొరేటర్ అల్లు శంకరరావు
- విశాఖపట్నం

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న 49వ వార్డు కార్పొరేటర్ అల్లు శంకరరావు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేక సంతకాల సేకరణ కార్యక్రమం లో భాగంగా, విశాఖ నగరంలోని 49వ వార్డు బూత్ నెం.37 పరిధిలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి, జి.వి.ఎమ్.సి. డిప్యూటీ ఫ్లోర్ లీడర్, 49వ వార్డు కార్పొరేటర్ అల్లు శంకర్రావు ముఖ్య అతిథిగా హాజరై, ప్రతి గడపకు స్వయంగా వెళ్లి ప్రజల సంతకాలను సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పేద మధ్యతరగతి కుటుంబాలకు తీవ్రమైన నష్టం కలిగిస్తుంది. ఇది ప్రజల ఆరోగ్య హక్కును హరిస్తుంది. ప్రైవేటీకరణ వల్ల వైద్యం ఖరీదై, అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. అంతేకాదు, ప్రభుత్వ కాలేజీల్లో తక్కువ ఖర్చుతో చదువుకునే అవకాశం మధ్యతరగతి విద్యార్థులు కోల్పోతారు” అని అన్నారు ప్రజల్లో ఈ విషయంపై అవగాహన పెంచడం, ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించేలా ప్రజా చైతన్యం కల్పించడం అత్యవసరమని, “కోటి సంతకాల సేకరణ కార్యక్రమం” ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించవచ్చని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు విద్యార్థి విభాగం ఎగ్జిక్యూటివ్ మెంబర్ పల్లా చైతన్య, వార్డు జనరల్ సెక్రటరీ జి. వెంకటరావు, సెక్రటరీ అచ్చుత వేణి, బూత్ కమిటీ అధ్యక్షుడు సత్యాడ నాగేశ్వరరావు, ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు రిసు చిన్నరావు, ఆర్‌టిఐ వింగ్ అధ్యక్షుడు ఎ. నరసింహులు, యూత్ అధ్యక్షుడు ఇగలపాట్టి రాజేష్, వాణిజ్య విభాగం అధ్యక్షుడు గెళ్ల రాంబాబు, పబ్లిసిటీ విభాగం అధ్యక్షురాలు సోమరపాటి కనకమహాలక్ష్మి, మహిళా నాయకులు పద్మ, లీల, గౌతమి, శైలు, కనకమహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేక సంతకాల సేకరణ కార్యక్రమం లో భాగంగా, విశాఖ నగరంలోని 49వ వార్డు బూత్ నెం.37 పరిధిలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి, జి.వి.ఎమ్.సి. డిప్యూటీ ఫ్లోర్ లీడర్, 49వ వార్డు కార్పొరేటర్ అల్లు శంకర్రావు ముఖ్య అతిథిగా హాజరై, ప్రతి గడపకు స్వయంగా వెళ్లి ప్రజల సంతకాలను సేకరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పేద మధ్యతరగతి కుటుంబాలకు తీవ్రమైన నష్టం కలిగిస్తుంది. ఇది ప్రజల ఆరోగ్య హక్కును హరిస్తుంది.
ప్రైవేటీకరణ వల్ల వైద్యం ఖరీదై, అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. అంతేకాదు, ప్రభుత్వ కాలేజీల్లో తక్కువ ఖర్చుతో చదువుకునే అవకాశం మధ్యతరగతి విద్యార్థులు కోల్పోతారు” అని అన్నారు
ప్రజల్లో ఈ విషయంపై అవగాహన పెంచడం, ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించేలా ప్రజా చైతన్యం కల్పించడం అత్యవసరమని, “కోటి సంతకాల సేకరణ కార్యక్రమం” ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించవచ్చని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో వార్డు విద్యార్థి విభాగం ఎగ్జిక్యూటివ్ మెంబర్ పల్లా చైతన్య, వార్డు జనరల్ సెక్రటరీ జి. వెంకటరావు, సెక్రటరీ అచ్చుత వేణి, బూత్ కమిటీ అధ్యక్షుడు సత్యాడ నాగేశ్వరరావు, ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు రిసు చిన్నరావు, ఆర్‌టిఐ వింగ్ అధ్యక్షుడు ఎ. నరసింహులు, యూత్ అధ్యక్షుడు ఇగలపాట్టి రాజేష్, వాణిజ్య విభాగం అధ్యక్షుడు గెళ్ల రాంబాబు, పబ్లిసిటీ విభాగం అధ్యక్షురాలు సోమరపాటి కనకమహాలక్ష్మి, మహిళా నాయకులు పద్మ, లీల, గౌతమి, శైలు, కనకమహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.