మల్కాజ్గిరి, అక్టోబర్ , పున్నమి ప్రతినిధి
మల్కాజ్గిరి మండలంలోని మల్లికార్జున్నగర్ సమీపంలోని కొండపై రాళ్లు జారిపడిన ఘటన స్థానికులను ఒక్కసారిగా భయాందోళనకు గురి చేసింది. సంఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా స్పందించగా, ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడం శుభపరిణామంగా నిలిచింది. సమాచారం అందుకున్న వెంటనే ఆపత్ ప్రతిస్పందన దళం (Disaster Response Force – DRF) సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని నియంత్రించింది. అధికారులు రాళ్ల కదలికలపై జాగ్రత్త చర్యలు చేపట్టారు. ప్రజలను ఆ ప్రాంతానికి వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు.


