శ్రీకాళహస్తి, ఏప్రిల్ 18 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి రూరల్ మండలం బి.వి. పురం గిరిజన కాలనీలో బడి ఈడు పిల్లలందరూ బడిలోనే ఉండాలనే లక్ష్యంతో ‘ప్రగతి’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శనివారం భారీ ఎన్రోల్మెంట్ (నమోదు) అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు, ఉపాధ్యాయులు గ్రామంలో ఇంటింటా తిరిగి, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రగతి స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం, ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, ‘తల్లికి వందనం’ వంటి పథకాలు అందుతున్నాయని వివరించారు. ప్రతి బిడ్డను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని కోరారు. విద్యతోనే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని, బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాల నిర్మూలనకు విద్యే ఏకైక మార్గమని పిలుపునిచ్చారు.”ఎక్కడికో ఎందుకు దండగ.. మన ఊరిలో ప్రభుత్వ బడి ఉండగా”, “ఆడపిల్లల చదువు – దేశానికి వెలుగు” వంటి ప్లేకార్డులు చేతబట్టి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. కరపత్రాల ద్వారా ప్రభుత్వ విద్యా పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ప్రగతి కో-కన్వీనర్ రామచంద్ర, బి.వి. పురం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉదయ కుమారి, ఉపాధ్యాయులు మధుసూదన్, అంగన్వాడీ టీచర్ పద్మ, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

‘మన ఊరి బడి – అందరి బడి’- గిరిజన కాలనీలో ‘ప్రగతి’ స్వచ్ఛంద సంస్థ విద్యా చైతన్య యాత్ర