మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో 07వ బ్యాచ్‌కు చెందిన నూతనంగా నియమితులైన మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు శిక్షణా తరగతులు ఘనంగా నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో భాగంగా “మండల పార్టీ అధ్యక్షుల విధులు – విధానాలు” అనే అంశంపై మాజీ మండల పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర గ్రామీణ పరిశ్రమల చైర్మన్ కె.కె.చౌదరి సమగ్రంగా అవగాహన కల్పించారు. పార్టీ బలోపేతం, కేడర్ సమన్వయం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లడంలో మండల స్థాయి నాయకుల పాత్ర అత్యంత కీలకమని ఆయన అన్నారు. పార్టీ సిద్ధాంతాలు, విధానాలకు కట్టుబడి పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని సూచించారు. ఈ శిక్షణా తరగతులు నాయకుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి, భవిష్యత్తు కార్యాచరణకు దిశానిర్దేశం చేస్తున్నాయని పార్టీ నేతలు తెలిపారు.



