భారత హాకీ శతాబ్ది ఉత్సవాలు పురస్కరించుకొని నంద్యాల హాకీ సంఘం ఆధ్వర్యంలో నంద్యాల లయన్స్ క్లబ్ సహకారంతో మంగళవారం రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో “భారత హాకీ చరిత్ర – ధ్యాన్ చంద్ జీవితం” అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు పోటీల ప్రారంభోత్సవ సందర్భంగా హాకీ ఆంధ్రప్రదేశ్ సంఘం అధ్యక్షులు చాణక్య రాజు,ఉమ్మడి కర్నూలు జిల్లా మాజీ ఒలింపిక్ చైర్మన్ డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ జాతీయ క్రీడ అయిన హాకీ క్రీడపై విద్యార్థులలో, యువతలో ఆసక్తి పెంచి,హాకీ క్రీడకు ప్రాచుర్యం కల్పించడం కోసం హాకీ శతాబ్ది ఉత్సవాలు పురస్కరించుకుని వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఏడవ తేదీ ఎస్పీజీ మైదానంలో జరిగే హాకీ శతాబ్ది ఉత్సవాలలో, నంద్యాల లయన్స్ క్లబ్ వ్యవస్థాపక సభ్యులు ఆత్మకూరు సుదర్శనం శెట్టి సౌజన్యంతో బహుమతులు అందజేస్తామన్నారు ఈ కార్యక్రమంలో నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు, కోశాధికారి అమిదేల జనార్ధన్,నంద్యాల హాకీ సంఘం ఉపాధ్యక్షులు జెడ్ ఎస్పీ దివాకర్, కళారాధన కార్యనిర్వాహక కార్యదర్శి పత్తి రంగనాథ్ పాల్గొన్నారు.
*వ్యాస రచన పోటీ విజేతలు* గుడ్ షెఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కు చెందిన నాగ శ్వేత,యశస్విని రెడ్డి,కరిష్మా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించగా,స్పెషల్ జ్యూరీ బహుమతులకు మనస్వి,అర్చన ఎంపికయ్యారు గురువారం ఆరవ తేదీ ఆంగ్ల వక్తృత్వ పోటీలు హాకీ చరిత్ర – ధ్యాన్ చంద్ జీవితం అంశంపై ఆంగ్లంలో వక్తృత్వ పోటీలు రామకృష్ణ డిగ్రీ కళాశాలలో గురువారం ఆరవ తేదీ ఉదయం 10 గంటలకు నిర్వహిస్తారు. ఆసక్తి గల హైస్కూల్ విద్యార్థులు పోటీ సమయంలో నేరుగా వచ్చి పాల్గొనవచ్చు.

భారత హాకీ చరిత్ర- ధ్యాన్ చంద్ జీవితం” వ్యాసరచన పోటీలు
భారత హాకీ శతాబ్ది ఉత్సవాలు పురస్కరించుకొని నంద్యాల హాకీ సంఘం ఆధ్వర్యంలో నంద్యాల లయన్స్ క్లబ్ సహకారంతో మంగళవారం రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో “భారత హాకీ చరిత్ర – ధ్యాన్ చంద్ జీవితం” అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు పోటీల ప్రారంభోత్సవ సందర్భంగా హాకీ ఆంధ్రప్రదేశ్ సంఘం అధ్యక్షులు చాణక్య రాజు,ఉమ్మడి కర్నూలు జిల్లా మాజీ ఒలింపిక్ చైర్మన్ డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ జాతీయ క్రీడ అయిన హాకీ క్రీడపై విద్యార్థులలో, యువతలో ఆసక్తి పెంచి,హాకీ క్రీడకు ప్రాచుర్యం కల్పించడం కోసం హాకీ శతాబ్ది ఉత్సవాలు పురస్కరించుకుని వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఏడవ తేదీ ఎస్పీజీ మైదానంలో జరిగే హాకీ శతాబ్ది ఉత్సవాలలో, నంద్యాల లయన్స్ క్లబ్ వ్యవస్థాపక సభ్యులు ఆత్మకూరు సుదర్శనం శెట్టి సౌజన్యంతో బహుమతులు అందజేస్తామన్నారు ఈ కార్యక్రమంలో నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు, కోశాధికారి అమిదేల జనార్ధన్,నంద్యాల హాకీ సంఘం ఉపాధ్యక్షులు జెడ్ ఎస్పీ దివాకర్, కళారాధన కార్యనిర్వాహక కార్యదర్శి పత్తి రంగనాథ్ పాల్గొన్నారు. *వ్యాస రచన పోటీ విజేతలు* గుడ్ షెఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కు చెందిన నాగ శ్వేత,యశస్విని రెడ్డి,కరిష్మా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించగా,స్పెషల్ జ్యూరీ బహుమతులకు మనస్వి,అర్చన ఎంపికయ్యారు గురువారం ఆరవ తేదీ ఆంగ్ల వక్తృత్వ పోటీలు హాకీ చరిత్ర – ధ్యాన్ చంద్ జీవితం అంశంపై ఆంగ్లంలో వక్తృత్వ పోటీలు రామకృష్ణ డిగ్రీ కళాశాలలో గురువారం ఆరవ తేదీ ఉదయం 10 గంటలకు నిర్వహిస్తారు. ఆసక్తి గల హైస్కూల్ విద్యార్థులు పోటీ సమయంలో నేరుగా వచ్చి పాల్గొనవచ్చు.

