పున్నమి ప్రతినిధి నిర్మల్ ఆగస్టు:
రిజర్వేషన్ ల అమలుకోసం 50 శాతం నిబంధన ఎత్తివేస్తూ బిసి లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసినందుకు *ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మాజీ ఏమ్మెల్యే శ్రీ భోస్లె నారాయణ్ రావు పటేల్ గారు* హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ చర్యలను సమాజం సంపూర్ణాంగా స్వాగతించాలని ఆయన ఆకాంక్షించారు.
అన్ని రకాలుగా సాంకేతిక, న్యాయ, రాజకీయ అంశాలన్నీ పరిగణలోకి తీస్కొని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బిసి లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీ లో ఏకగ్రీవంగా బిల్లు చేయడం పట్ల ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
బిల్లు కోసం అన్ని రకాల చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కు, మంత్రి వర్గ ఉప సంఘానికి బిల్లుకు మద్దతు తెలిపిన ప్రతిపక్ష నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
బిసి వాటా ప్రకారం రాజకీయ అవకాశాలు కల్పించాలని మొదటి నుంచి ఆకాంక్షిస్తున్న ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆశయాలు తెలంగాణ లో నెరవేర బోతున్నాయని ఇది మంచి పరిణామమని ఆయన అన్నారు…
ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారి సారధ్యంలో ఈ బిసి రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా అమలు అయ్యేలా తెలంగాణ నుబచే అడుగులు పడతాయని అన్నారు. ఇది దేశవ్యాప్తంగా అమలు అయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని అన్నారు.


