Thursday, 26 March 2026
  • Home  
  • బంగాళాఖాతంలో_మరో_అల్పపీడనం
- పల్నాడు

బంగాళాఖాతంలో_మరో_అల్పపీడనం

👉 తూర్పు మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం మరో అల్పపీడనం ఏర్పడొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తర్వాత అది 24 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ కర్ణాటకలో కొనసాగుతున్న అల్పపీడనం పశ్చిమ వాయవ్యదిశగా కదులుతూ తూర్పు మధ్య, ఆగ్నేయ అరేబియా సముద్రం మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని పేర్కొంది. వీటి ప్రభావంతో మరో 4రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. 👉 కోస్తాలో గంటకు 30-40 కి.మీ. నుంచి 50 కి.మీ. గరిష్ఠ వేగంతో గాలులు, ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురవొచ్చని తెలిపింది. నీ రాయలసీమలో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు మరో ఒకటి రెండు ప్రాంతాల్లో భారీ వానలు పడొచ్చని చెప్పింది. నీ దక్షిణ కోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శుక్రవారం అంబేడ్కర్ కోనసీమ, కృష్ణా, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, నంద్యాల జిల్లాలో వర్షాలు పడతాయని తెలిపింది.

👉 తూర్పు మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం మరో అల్పపీడనం ఏర్పడొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తర్వాత అది 24 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ కర్ణాటకలో కొనసాగుతున్న అల్పపీడనం పశ్చిమ వాయవ్యదిశగా కదులుతూ తూర్పు మధ్య, ఆగ్నేయ అరేబియా సముద్రం మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని పేర్కొంది. వీటి ప్రభావంతో మరో 4రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

👉 కోస్తాలో గంటకు 30-40 కి.మీ. నుంచి 50 కి.మీ. గరిష్ఠ వేగంతో గాలులు, ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురవొచ్చని తెలిపింది. నీ రాయలసీమలో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు మరో ఒకటి రెండు ప్రాంతాల్లో భారీ వానలు పడొచ్చని చెప్పింది. నీ దక్షిణ కోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శుక్రవారం అంబేడ్కర్ కోనసీమ, కృష్ణా, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, నంద్యాల జిల్లాలో వర్షాలు పడతాయని తెలిపింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.