కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం నెహ్రూ రోడ్డులో
మద్యం మత్తులో ఇద్దరి స్నేహితుల మధ్య గొడవ చివరికి హత్యకు దారి తీసిన సంఘటన కడప జిల్లా ప్రొద్దుటూరులో చోటుచేసుకుంది. ప్రొద్దుటూరులోని నాగుల కట్ట వీధికి చెందిన వినయ్, సుబ్బులు ఇద్దరు స్నేహితులు. ఈరోజు మధ్యాహ్నం మద్యం సేవించడానికి వినయ్ ఇంటికి వెళ్లిన సుబ్బు ఇద్దరు కలిసి సాయంత్రం వరకు ఫుల్ గా మద్యం సేవించారు. మద్యం మత్తులో ఇరువురికి మాటా మాటా పెరిగి గొడవపడ్డారు. దీంతో వినయ్ సుబ్బును మద్యం సీసాతో పొడిచి హత్య చేశాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన వినయ్ భార్య అక్కడి పరిస్థితిని చూసి పోలీసులకు సమాచారం అందించింది. సంఘటన స్థలాన్ని ప్రొద్దుటూరు ఏ ఎస్ పి విభూక్రిష్ణ త్రీ టౌన్ పోలీసులు పరిశీలించారు. ముద్దాయి వినయ్ ను అదుపులోకి తీసుకొని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.



